మరికొన్ని  రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న వేళ టీమిండియాలో సీనియర్ల మాత్రం ప్రస్తుతం అందరినీ భయపెడుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  గత కొంత కాలం నుంచి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ కారణంగా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఒక్క మ్యాచ్లో కూడా సక్సెస్ కాలేకపోతున్నారూ అన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఐపీఎల్ లో కూడా ఈ ఇద్దరు సీనియర్ ప్లేయర్స్ అట్టర్ ప్లాప్ షో చేశారు.  సౌత్ ఆఫ్రికా తో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.


 అయితే ఈ ఏడాది ఐపీఎల్లో 600 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ పై విమర్శలు మాత్రం తప్పలేదు. ఎందుకంటే జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో దూకుడుగా ఆడకుండా సేఫ్ గేమ్ ఆడాడు అంటూ ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు కె.ఎల్.రాహుల్.  ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ ఫామ్ లో ఉన్నా లేకపోయినా మా టాప్ త్రీ ప్లేయర్ ల క్వాలిటీ గురించి మాకు బాగా తెలుసు.. ఆ ముగ్గురు కూడా టాప్ క్లాస్ ప్లేయర్లు అంటూ రాహుల్ ద్రావిడ్ చెప్పుకొచ్చాడు. వాళ్లని జట్టు కోసం ఎలా ఉపయోగించుకోవాలో మాకు బాగా తెలుసు. అయితే సౌత్ ఆఫ్రికా లో జరిగే టి20 సిరీస్ లో మాత్రం మా టాప్ త్రీ పొజిషన్ మారింది. మేము పాజిటివ్ ఎనర్జీ తో సిరీస్ ప్రారంభించాలనుకుంటున్నామూ అంటూ చెప్పుకొచ్చాడు.


 ఇక భారత జట్టులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జట్టు లో వారి పాత్ర ఏమిటి అన్న దానిపై క్లారిటీ ఇచ్చేసాము.  ఈ క్రమంలోనే తుది జట్టులో స్థానం సంపాదించుకున్న ప్రతి ఒక్కరు కూడా తమ పాత్రలకు తగ్గట్టుగా రాణించడానికి సిద్ధమయ్యారు. కేఎల్ రాహుల్ కి కెప్టెన్సీ కొత్తేమీకాదు. రోహిత్ శర్మ ఆల్ ఫార్మాట్ ప్లేయర్. అలాంటి ప్లేయర్  ప్రతి సిరీస్కు అందుబాటులో ఉండాలని కోరుకోవడం అత్యాశ అవుతుంది అంటూ తెలిపిన రాహుల్ ద్రావిడ్ అందుకే రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు. అలాగని దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ ను తేలికగా తీసుకోవడం లేదు అంటూ తెలిపాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: