ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. టెస్టు సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లు వీర విహారం చేస్తూ భారీగా పరుగులు చేస్తూ ఎన్నో రికార్డులను కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలోనే సెంచరీలతో చెలరేగిన పోతూ అటు న్యూజిలాండ్ బౌలర్లతో చెడుగుడు ఆడేస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే రెండవ టెస్ట్ మ్యాచ్లో వరుస సెంచరీలతో అదరగొట్టి అందరిని ఆశ్చర్యపరిచిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లు ఇప్పుడు మూడో టెస్ట్ మ్యాచ్లో కూడా అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు.


 ఈ క్రమంలోనే ఇటీవల న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో భాగంగా సరికొత్త రికార్డును నమోదు చేశారు. జానీ బెయిర్ స్ట్రో సెంచరీ జామి ఓవర్టన్ తో కలిసి నెలకొల్పిన రికార్డు భాగస్వామ్యం నేపథ్యంలో ఎంతో బలంగా ఇంగ్లాండ్ జట్టు పుంజుకుంది అనే చెప్పాలి. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు 55 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. అక్కడి నుంచి జానీ బెయిర్ స్ట్రో, ఓవర్ టన్   ఏడో వికెట్ కు అజేయంగా 209 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.


 ఇందులో జానీ బెయిర్ స్ట్రో 130 పరుగులతో అజేయంగా నిలవగా ఓవర్ టన్ 89 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. ఈ క్రమంలోనే 62 ఏళ్ల రికార్డు కు బ్రేకులు వేశారు ఈ ఇద్దరు ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లు.  టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లాండ్ తరఫున ఏడో వికెట్ కి అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడిగా జానీ బెయిర్ స్ట్రో ఓవర్ టన్ లు రికార్డు సృష్టించారు. గతంలో జిమ్ పార్క్, మైక్ స్మిత్ లు 62 ఏళ్ళ క్రితం  1960లో  197 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక ఇప్పుడు బెయిర్ స్ట్రో, ఓవర్ టన్ లు ఆ రికార్డు బద్దలు కొట్టారు. అంతేకాకుండా టెస్టులో ఐదు వేల పరుగులు పూర్తి చేసుకున్న 24 ఇంగ్లీష్ బ్యాట్స్మెన్గా జానీ బెయిర్ స్ట్రో రికార్డు సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: