అటు ఇంగ్లాండ్ క్రికెట్ లో పవర్ హిట్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు బెన్ స్ట్రోక్స్. ఇక ఎన్నో ఏళ్ల నుంచి ఇంగ్లండ్ జట్టులో కీలక ఆటగాడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అని చెప్పాలి. ఎప్పుడు మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ ఇంగ్లండ్ జట్టును విజయతీరాలకు నడిపించడంలో ఎంతో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు. మొన్నటివరకు జట్టుకు కీలక ఆటగాడిగా కొనసాగిన బెన్ స్టోక్స్ ఇటీవలికాలంలో టెస్టు జట్టు కెప్టెన్సి కూడా అందుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక సారథిగా ప్రతీ మ్యాచ్ లో కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు బెన్ స్టోక్స్.


 ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడనుంది అన్న విషయం తెలిసిందే. టెస్టు సిరీస్ లో తన బ్యాటింగ్తో అదరగోడుతూ జట్టును విజయతీరాలకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంతేకాదు తనదైన వ్యూహాలతో సారథిగా కూడా సక్సెస్ అవుతున్నాడు. ఇటీవలే టెస్టు ఫార్మాట్లో అరుదైన రికార్డు సాధించాడు స్టోక్స్. అయితే సాధారణంగా టీ20 వన్డే ఫార్మాట్లో బ్యాట్స్మెన్లు ఎక్కువగా సిక్సర్లు కొట్టడం చూస్తూ ఉంటాం. కానీ టెస్టు ఫార్మాట్లో మాత్రం ఇలా బ్యాట్స్మెన్లు సిక్సర్లతో చెలరేగి పోవడం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఇప్పటివరకు వన్డే,టి20 ఫార్మాట్లు 100 సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్లు ఎంతోమంది ఉన్నారు. టెస్ట్ ఫార్మాట్ లో మాత్రం లిస్టు చాలా చిన్నగా ఉంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు సారథి బెన్ స్టోక్స్ ఇటీవలే టెస్ట్ క్రికెట్లో వంద సిక్సర్లు బాదిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు న్యూజిలాండ్ దిగ్గజం మెకల్లమ్  అత్యధిక సిక్సర్లు (107)ను అధిగమించాలనే కనిపిస్తున్నాడు.. కాగా ప్రస్తుతం అటు ఇంగ్లాండ్ జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు మేకల్లమ్. ఒకసారి లిఫ్ట్ చూస్తే.. బ్రెండన్ మెకల్లమ్ 176 ఇన్నింగ్స్ లో 107 సిక్సర్లు.. ఆడమ్ గిల్క్రిస్ట్ 137 ఇన్నింగ్స్ లో వంద సిక్సర్లు.. బెన్ స్టోక్స్ 151 ఇన్నింగ్స్ లో వంద సిక్సర్లు.. మాత్రమే టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ లుగా ఉన్నారు. ఇక బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు సాధించడం పై అభిమానులు అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: