ఈ క్రమంలోనే వరుస ఓటములతో పాయింట్లు పట్టికలో చివరన చేరిన ముంబై ఇండియన్స్ జట్టు ఇక లీగ్ దశతోనె సరిపెట్టుకుంది. అయితే ఇక 2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి ఇప్పటినుంచి అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఇక తమ జట్టును పటిష్టంగా మార్చుకునేందుకు ముంబై ఇండియన్స్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఇప్పటికే తాము వదులుకోబోయే ఆటగాళ్ల వివరాలను బీసీసీఐకు ఇచ్చింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. అదే సమయంలో కొంతమంది ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటుంది అనేది తెలుస్తుంది.
ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగాన్ని మరింత దృఢంగా మార్చుకునేందుకు ఆస్ట్రేలియా ఫెసర్ జాసన్ బేహ్రన్ డార్ఫ్ జట్టులోకి తీసుకుంది అన్నది తెలుస్తుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నుంచి ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్ ముంబై ఇండియన్స్ లోకి వచ్చేసాడు. 2022 మెగా వేలంలో అతడిని ఆర్సిబి 75 లక్షలకు కొనుగోలు చేయగా.. ఇప్పుడు అదే మొత్తానికి ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.. అయితే ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టులో బుమ్రా, ఆర్చర్, సామ్స్ ఉండగా ఇప్పుడు వారికి జాసన్ బేహ్రన్ డార్ఫ్ తోడు కానున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగం ప్రత్యర్థులకు వణుకు పుట్టించడం ఖాయం అన్నది తెలుస్తుంది. మరి ఈ స్టార్ పెసర్ రానున్న ఐపిఎల్ సీజన్ లో ఎలా రాణిస్తాడో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి