టీమిండియాలో స్టార్ ఓపెనర్ గా ప్రస్తానాన్ని కొనసాగించి అద్భుతమైన ప్రదర్శనతో ఎన్నోసార్లు జట్టుకు విజయం అందించిన శిఖర్ ధావన్ గత కొంతకాలం నుంచి కేవలం వన్డే ఫార్మాట్ కి మాత్రమే పరిమితం అయ్యాడు అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు భారత జట్టులో అడపాదడప అవకాశాలు మాత్రమే దక్కించుకున్న శిఖర్ ధావన్ ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టిన నాటి నుంచి మాత్రం అటు భారత జట్టులో తరచూ కనిపిస్తూనే ఉన్నాడు. రోహిత్ ఎక్కువ మ్యాచ్లకి కెప్టెన్గా అందుబాటులో ఉండలేకపోతున్న నేపథ్యంలో ఇక అప్పుడప్పుడు భారత జట్టుకు తాత్కాలిక కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.


 ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే శిఖర్ ధావన్ ఇక మిగతా ఆటగాళ్లలో కూడా అదే ఉత్సాహాన్ని నింపుతూ ఆడుతూ పాడుతూ ప్రత్యర్థులను ఓడిస్తూ సిరీస్లను కైవసం చేసుకుంటూ ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే మరోసారి శిఖర్ ధావన్ కు టీమ్ ఇండియా కెప్టెన్గా అవకాశం వచ్చింది. న్యూజిలాండ్ టూర్ లో భాగంగా రెగ్యులర్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ సహా పలువురు సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతి ప్రకటించిన నేపథ్యంలో శిఖర్ ధావన్ కు సారధ్య బాధ్యతలు అప్పగించారు టీమిండియా యాజమాన్యం. అయితే శిఖర్ ధావన్ ఇక మొదటి వన్డే మ్యాచ్ లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.


 ఇప్పుడు వరకు భారత క్రికెట్ చరిత్రలో ఎన్నడు లేనివిధంగా న్యూజిలాండ్ గడ్డపై భారత ఓపెనింగ్ విభాగం 124 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఇది ఇలా ఉంటే ఇక్కడ దావన్ కు భారత క్రికెట్లో అన్యాయం జరిగిందంటూ మాజీ కోచ్ రవి శాస్త్రి వ్యాఖ్యనించాడు. శిఖర్ ధావన్ కు వన్డేల్లో అద్భుతమైన రికార్డు ఉంది. టాలెంటెడ్ యువ ఆటగాళ్ళు చాలా మంది ఉన్న ధావన్ కు వన్డేలో ఉన్న అనుభవం ఎంతో విలువైనది అంటూ  రవి శాస్త్రి ప్రశంసించాడు. అయితే శిఖర్ ధావన్ కు రావాల్సినంత పేరు మాత్రం రాలేదు. విరాట్ కోహ్లీ రోహిత్ శర్మపైనే ప్రేక్షకులు అందరి దృష్టి ఉండడం ఇందుకు కారణం. అయితే ఇక కెప్టెన్గా శిఖర్ ధావన్ యువ ఆటకాలను బాగా గైడ్ చేయగలడు అంటూ రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: