అంతేకాదు గత కొంతకాలం నుంచి టి20 ఫార్మాట్లో అత్యుత్తమమైన ప్రతిభ కనబరిస్తున్న సూర్య కుమార్ యాదవ్ అదరగొడుతున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా స్టార్ బౌలర్లు తనకు బౌలింగ్ చేస్తున్న కూడా ఎక్కడ తడబాటు లేకుండా మైదానం నెలవైపులా కూడా ఎంతో అలవోకగా షాట్లు ఆడగలుగుతున్నాడు సూర్య కుమార్. ఈ క్రమంలోనే సూర్య కుమార్ యాదవ్ 360 డిగ్రీస్ ఆట తీరుకు వెనకున్న అసలు రహస్యం ఏంటి అని తెలుసుకోవడానికి ఎంతోమంది ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై సూర్య కుమార్ స్పందించాడు తన బ్యాటింగ్ లో 360 డిగ్రీస్ మెరుపుల రహస్యం గురించి చెప్పుకొచ్చాడు.
తాను స్కూల్లో చదువుతున్న సమయంలో సిమెంట్ ట్రాక్ పై ఆడేవాడినని గుర్తు చేసుకున్నాడు. అక్కడి నుంచే 360 డిగ్రీస్ ఆట మొదలైంది అంటూ చెప్పుకుచ్చాడు. రబ్బరు బంతులతో క్రికెట్ ఆడే సమయంలో లెగ్ సైడ్ బౌండరీ 95 మీటర్ల.. దూరంలో ఉంటే హాఫ్ సైడ్ బాగుండదు ఈ కేవలం 30 మీటర్ల దూరంలో ఉండేది. అందుకే వేగంగా లెగ్ సైడ్ వైపు దూసుకు వచ్చే బంతులను తక్కువ దూరంలో ఉన్న ఆఫ్ సైడ్ వైపు కొట్టేందుకు చేసిన ప్రయత్నమే ఇక ఇప్పుడు 360 డిగ్రీస్ బ్యాటింగ్ కి కారణమైంది అంటూ తెలిపాడు. దీనికోసం నెట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు అంటూ తెలిపాడు. ఇకపోతే తన అద్భుతమైన బ్యాటింగ్ తో ఇలా భారత జట్టులోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఐసిసి ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి