
ఇలా తొలి రోజు తొలి సెషన్లోనే భారత బౌలర్లు సత్తా చాటారు అని చెప్పాలి. ఇక మొత్తంగా తొలిరోజు ఆట ముగిసే సమయానికి 150 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది వెస్టిండీస్ జట్టు. కాగా ఇలా మొదటి ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు కేవలం బంతులతోనే కాదు ఫీల్డింగ్ తో కూడా అదరగొట్టారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే బ్లాక్ వుడ్ ఇచ్చిన క్యాచ్ ను సిరాజ్ పట్టిన తీరు అయితే ప్రేక్షకులు అందరిని కూడా ఆశ్చర్యపరిచింది. ఇటీవల భారత్తో జరిగిన మ్యాచ్ అతనికి అరంగేట్రా మ్యాచ్ కావడం గమానర్హం. కాగా 14 పరుగుల వద్ద బ్లాక్ వుడ్ అవుట్ అయ్యాడు.
రవీంద్ర జడేజా బౌలింగ్ వేస్తున్న సమయంలో ఇక అతను మహమ్మద్ సిరాజ్ కు క్యాచ్ ఇచ్చి చివరికి వికెట్ కోల్పోయాడు. అయితే హైదరాబాద్ బౌలర్ సిరాజ్ అద్భుతమైన క్యాచ్ అందుకొని అందరిని అశ్చర్య పరిచాడు . ఈ ప్రక్రియలో సిరాజ్ మోచేతికి చిన్న గాయం అయింది అని చెప్పాలి. అయితే ఇంతటి అద్భుతమైన క్యాచ్ పట్టడంతో చివరికి ఆ నొప్పి కూడా మాయం అయిపోయింది. అతను సంబరాలు చేసుకున్నాడు. జడేజా ఆఫ్ స్టంప్ పై విసిరిన బంతిని బ్లాక్వుడ్ భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే అతను భారీ షాట్ గా మలచడంలో విఫలమయ్యాడు. మిడాఫ్ వైపు గాల్లోకి లేచిన బంతిని.. అక్కడే ఉన్న సిరాజు వెనక్కి పరిగెత్తుకుంటూ గాల్లోకి డైవ్ చేసి కళ్ళు చేదులే క్యాచ్ అందుకున్నాడు. దీంతో బ్లాక్ వుడ్ నిరాశతో పెవిలియన్ చేరాడు.