ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా ఐపీఎల్ హడావిడి కనిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక వరుసగా మ్యాచ్ లు జరుగుతూ ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైర్మెంట్ అందిస్తూ ఉన్నాయి. అయితే ఇలా ఐపిఎల్ జరుగుతున్న సమయంలో ముంబై ఇండియన్స్ అభిమానులు అందరిలో కూడా ఒకే విషయంపై చర్చ జరుగుతుంది. అదే కెప్టెన్సీ మార్పు గురించి  ఏకంగా జట్టుకు ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్స్ అందించి టీం ని ఛాంపియన్ జట్టుగా నిలిపిన రోహిత్ శర్మను అర్ధాంతరంగా కెప్టెన్సీ నుంచి తప్పించిన ఆ జట్టు యాజమాన్యం హార్దిక్ పాండ్యాకు సారధ్య బాధ్యతలు అప్పగించింది.



 ఈ క్రమంలోనే ఇక ముంబై ఇండియన్స్ యాజమాన్యం తీవ్రస్థాయిలో నెగెటివిటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇలా రోహిత్ స్థానంలో సారధ్య బాధ్యతలు చేపట్టిన హార్దిక్.. కనీసం సక్సెస్ అయివుంటే నైనా విమర్శలు తగ్గేవేమో.. కానీ ఇక హార్దిక్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ చెత్త ప్రదర్శన చేస్తూ తీవ్ర నిరాశ పరుస్తూ ఉంది. ఇప్పటివరకు కనీసం ఈ ఐపిఎల్ సీజన్లో భోని కూడా కొట్టలేదు ముంబై ఇండియన్స్. మూడు మ్యాచ్లు ఆడి మూడింటిలో కూడా పరాజయం పాలు అయింది. దీంతో ఇక మరింత తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి.


 అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో ఇక హార్దిక్ ను కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ మళ్ళీ ముంబై ఇండియన్స్ సారధిగా రావచ్చు అంటూ అభిప్రాయపడ్డాడు. ఫ్రాంచైజీలు నిర్ణయాలు తీసుకోవడంలో అస్సలు మొహమాట పడవు. రోహిత్ శర్మను తీసేసి పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చారు. ఇప్పుడు ఐదు టైటిల్స్ అందించిన శర్మకు తిరిగి కెప్టెన్సీ ఇవ్వొచ్చు. పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. హార్దిక్ ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఏప్రిల్ 7 లోపు రోహిత్ శర్మ మళ్లీ కెప్టెన్ అవ్వొచ్చు అంటూ అభిప్రాయపడ్డాడు మనోజ్ తివారి.

మరింత సమాచారం తెలుసుకోండి: