నాకు సమాధానం కావాలి అంటుంది దీపా కార్తీక్ ఈ అడ్డుపడుతూ.. ఏంటి నీ ప్రశ్న అంటాడు కార్తీక్.. మీకు ఏమీ కానప్పుడు నా బ్రతుక్కు మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు.. మనశ్శాంతిగా బతకనివ్వదలచుకొలేదా.. ఎందుకు చెప్పండి.. అంటుంది దీపా ఆవేశంగా.. నేను వెళ్ళాలి అంటాడు కార్తీక్ ముఖం కిందకు పెట్టుకొని సమాధానం చెప్పడం ఇష్టం లేదన్నట్లుగా.. నన్ను వదిలేయ్ అంటూ కార్తీక్ దీప ను తప్పించుకొని వెళ్లబోతుంటే చేయి పట్టుకుని అవుతుంది..
వెంటనే కార్తీక్ తో అయితే నన్ను ఒక్కసారిగా చంపేయండి అంటూ కార్తీక్ చేతులని బలవంతంగా చుట్టుకొని నన్ను చంపేయండి డాక్టర్ బాబు చంపేయండి అని గట్టిగా ఏడుస్తూ అరుస్తుంది.. కార్తీక్ అప్పటికే ఎమోషనల్ అయిపోతూ ఏయ్ అని ఒక్కసారిగా దీప చేతులని వదిలించుకుంటాడు.. కోపంగా బాధగా కన్నీళ్లతో వణుకుతున్న స్వరంతో ఎవరు నిన్ను చంపక్కర్లేదు.. నువ్వు చావపోతున్నావు అనేసరికి దీప షాక్ అవుతుంది.. కార్తీక్ చాలా ఎమోషనల్ అవుతాడు.. ఈ ట్విస్ట్ చూస్తుంటే రేపటి ఎపిసోడ్ ఇప్పుడే చూసేయాలి అనిపిస్తుంది కదూ...