తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం వస్తున్న సీరియల్స్ లలో కార్తీకదీపం సీరియల్ ఎంతటి అభిమానాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.. వేల మంది మహిళా ప్రేక్షకులు ఈ సీరియల్ చూడడంతో పాటు మగవారు కూడా ఈ సీరియల్ ని ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉండటం విశేషం.. వాస్తవానికి ఈ సీరియల్ వస్తుంది అంటే ఏ తెలుగు ప్రేక్షకుడు కూడా ఛానల్ మార్చడానికి ఇష్టపడడు.. అలా అంతటి పేరు ప్రఖ్యాతలు పొందిన కార్తీకదీపం సీరియల్ లో నటించే ప్రతి ఒక్కరికి మంచి క్రేజ్ ఉంది.. సినిమా నటుల ని మించిన క్రేజ్ ఈ సీరియల్ లో నటించే వారి యొక్క సొంతం..

ఇప్పటి వరకు ఈ సీరియల్ గురించి చాలా చాలా గొప్పగా చెప్పుకున్నారు ప్రేక్షకులు.. రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరమైన మలుపులతో ఈ సీరియల్ నీ ఎంతో హృద్యంగా ఎంతో ఆసక్తికరంగా తయారుచేస్తున్నారు నిర్వాహకులు.. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు, వాళ్ళ మైండ్ సెట్ కి తగ్గట్లు రోజుకో ట్విస్ట్ ఇస్తూ కార్తీక్ దీపాల మధ్య అనుబంధాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు.. ఇక ఈ సీరియల్ మంచి రసపట్టు మీద ఉన్నట్లు ప్రేక్షకుల మాటలను బట్టి తెలుస్తుంది.. దీప చనిపోతుంది అన్న వార్త వారి గుండెలను భాదిస్తుండగా మున్ముందు సీరియల్ లో ఏమవుతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది..

మరి ఇంత కోపం సక్సెస్ ను సాధించిన ఈ సీరియల్ లో నటించే నటీనటుల పారితోషకం ఎలా ఉంటుంది అంటే ప్రేక్షకులు వీరికి భారీ రెమ్యూనరేషన్ ఉంటుందని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.. కార్తీక్ దీపాల పాత్రను పోషించే వారికి పారితోషికం భారీగా ఉంటుందని వారు అంచనాకు రాగా ఈ సీరియల్ లో వారి కూతుర్లు గా నటిస్తున్న శౌర్య, హిమ ల రెమ్యూనరేషన్ ఎంత ఉంటుందో కూడా వారు అంచనా వేస్తున్నారు.. మామూలుగా సీరియల్స్ లో రోజువారి పారితోషికం అందుకుంటారు ఆర్టిస్టులు.. అలా వీరిద్దరి పారితోషికం రోజుకు లక్ష కు పైగానే ఉంటుందని అంటున్నారు.. ఈ నేపథ్యంలో చిన్నతనంలోనే ఈ రేంజ్ లో సంపాదిస్తున్న ఇద్దరు పాపలు భవిష్యత్తులో ఇంకెన్ని మంచి మంచి అవకాశాలు పొందుతారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: