జబర్దస్త్ కామెడీ షో పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది జడ్జిలుగా ఉండేటువంటి రోజా, నాగబాబు.. ఎందుకంటే ఈ షో మొదలైనప్పటి నుంచి సుమారుగా కొన్నేళ్లపాటు జబర్దస్త్ లో వీరు జడ్జిగా కొనసాగించి జబర్దస్త్ సక్సెస్ లో భాగమయ్యారు. మధ్యలో చాలామంది జడ్జిలుగా సెలబ్రిటీలు వచ్చిన ఎందుకో అంతటికి సక్సెస్ ని అందుకోలేకపోతోంది జబర్దస్త్. వీటికి తోడు జబర్దస్త్ లో ఉండే కాంటెస్ట్స్ కూడా తమ కామెడీతో ఆకట్టుకోలేకపోతున్నారు. దీంతో టిఆర్పి రేటింగ్ కూడా ఈమధ్య తగ్గిపోయిందని అందుకే కేవలం ఒక్క షోనే చేస్తున్నారు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ముఖ్యంగా రోజా, నాగబాబు తమ పంచు డైలాగులతో స్పెషల్ అట్రాక్షన్ గా ఉండేవారు. ఆ తర్వాత పొలిటికల్ పరంగా అటు నాగబాబు, రోజా ఇద్దరు కూడా ఈ షో నుంచి తప్పుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ షో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రేషన్స్ ని చాలా గ్రాండ్గా చేశారు షో నిర్వాహకులు. ఇందుకు సంబంధించి తాజా ప్రోమాను కూడా విడుదల చేశారు. ఇందులో నాగబాబు, అనసూయ, రష్మితో సహా గతంలో టీమ్ లీడర్ గా కంటెస్టెంట్ గా ఉన్న వారందరూ కూడా కనిపించారు.


కానీ జబర్దస్త్ షో కి స్పెషల్ క్రేజ్ తెచ్చిన రోజా మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో పలువురు అభిమానులు రోజా ఎక్కడ అంటూ యూట్యూబ్లో కూడా కామెంట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా రోజాను పిలిచారా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉన్నది. రోజా రాకపోవడానికి ముఖ్య కారణం ఏంటబ్బా అంటూ అభిమానులు తెగ వెతికేస్తూ ఉన్నారు. ఇటీవలే జీ తెలుగులో ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ సీజన్ 8కి రోజా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే సూపర్ సీరియల్ ఛాంపియన్ అవార్డులలో కూడా కనిపించారు. కానీ అన్ని సంవత్సరాలు జబర్దస్త్ కి యాంకర్ గా చేసిన రోజు రాకుండా ఉండడంతో అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు. మరి ఈ విషయం పైన రోజా ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: