ఇంటర్నెట్ డెస్క్: చిన్న మాట ఎవరైనా అంటేనే అవమానంగా భావిస్తాం. రోజుల తరబడి బాధపడతాం. మనల్ని అవమానించిన వారికి బుధ్ధి చెప్పాలనుకుంటాం. వారిని ఏదో ఒకటి చేసి పగ తీర్చుకోవాలనుకుంటాం. అలాగే జీవితంలో ఎదురయ్యే అవమానాలు కొంత మందిని దుర్మార్గులుగా మార్చితే కొంతమందిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. విజయత్నాంకు చెందిన ఓ యువకుడు కూడా అలాంటి అవమానాలే ఎదుర్కొన్నాడు. అయితే ఆ అవమానాలు అతడిని ఎలా మర్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వియత్నాంకు చెందిన 26 ఏళ్ల డూ కూయెన్ ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా అక్కడ అవమానాలు ఎదురయ్యేవి. ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు అతని మొహాన్ని చూసి హేళన చేసేవారు. దీంతో అతడు చాలా బాధపడేవాడు.కూయెన్‌కు తన మొహంపై అసహ్యం వేసింది. ఎలాగైనా తన ముఖాన్ని అందంగా మార్చుకోవాలని అనుకున్నాడు. అసలు తాను ఎలా అందంగా ఉంటానో తెలుసుకునేందుకు మేకప్ ఆర్టిస్ట్‌గా ఉద్యోగం సంపాదించాడు. అలా పనిచేస్తూనే దాదాపు రూ.12 లక్షలకు పైగా వెనకేశాడు. దాని కోసం సంపాదించిన ప్రతి రూపాయి దాచాడు.

చివరికి వాటన్నింటినీ తీసుకెళ్లి.. ఓ ప్లాస్టిక్ సర్జన్‌ను కలిశాడు. తన ముఖానికి సర్జరీ చేసి అందంగా మార్చాలని కోరాడు. ఆ
డాక్టర్ అతడి ముఖాన్ని
చెక్ చేసి, పూర్తిగా మార్చాలంటే అనేక సర్జరీలు చేయాలని చెప్పాడు. దానికి కూయెన్ ఒప్పుకున్నాడు. డాక్టర్ల అతడి ముఖానికి 9 సర్జరీలు చేసి అందంగా మార్చారు. ఇక ఆ సర్జరీల తరువాత కూయెన్.. ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఇప్పుడు అతడిని ఎవరైనా చూస్తే కచ్చితంగా ఏవరో
అమెరికా అబ్బాయేమో అనుకుంటారు. అలా మారిపోయాడు.
తన రూపం పూర్తిగా మార్చుకున్న కూయెన్.. సర్జరీకి ముందు ఫొటోను, ఇప్పటి ఫొటోను తన టిక్ టాక్ ఖాతాలో షేర్ చేశాడు. అందులో తాను ఎదుర్కొన్న అవమానాలు, ఛీత్కారాలను వివరించాడు. ఆ రెండు ఫొటోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ముఖం మారిన తర్వాత ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు కూడా తనని గుర్తుపట్టలేకపోయారని ఆ యువకుడు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.