
ఒకప్పుడు మరణం గురించి ఎవరైనా అడిగితే అది వృద్ధాప్యంలో వస్తుంది. ఇప్పుడు ఎందుకు దాని గురించి చర్చ అని అనుకునేవారు అందరూ. కానీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్న ఘటన చూసిన తర్వాత చావు ఎప్పుడు తలుపు తడుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది అని చెప్పాలి. అందరూ మరణం గురించి చర్చించుకుంటున్నారు. ఎందుకంటే సడన్ హార్ట్ ఎటాక్ లు ఎంతోమందిలో ప్రాణ భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఎంతోమంది చిన్నల నుంచి పెద్దల వరకు ఇలా సడన్ హార్ట్ ఎటాక్ లతో ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ ఇలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది.
మధ్యప్రదేశ్లో రాజధాని భోపాల్ కి పోస్టల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు సురేంద్ర కుమార్ దీక్షిత్. ఇకపోతే ఇటీవల ఆల్ ఇండియా పోస్టల్ హాకీ టోర్నమెంట్ లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయ్. ఈ క్రమంలోనే సురేంద్ర కుమార్ దీక్షిత్ ఎంతో ఉత్సాహంగా చిందులు వేశారు. సహచరులతో కలిసి తెగ డాన్సులు చేశారు.. కానీ అంతలోనే ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పరీక్షించిన వైద్యులు ఇక కార్డియాక్ అరెస్ట్ కారణంగానే అతను మరణించాడు అన్న విషయాన్ని తేల్చారు. ఈ వీడియో ట్విటర్లో వైరల్ గా మారింది.