ఇంటర్నెట్ డెస్క్: ‘నాన్నా.. పందులే గుంపులు గుంపులుగా వస్తాయ్.. సింహం, సింగిల్‌గా వస్తుంది’ ఈ డైలాగ్ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. శివాజీ సినిమాలో విలన్ డెన్‌లో అడుగుపెట్టిన రజినీ కాంత్ ఈ డైలాగ్ చెప్తాడు. అయితే అది సినిమా కాబట్టి హీరో విలన్ మనుషులందరినీ చితక్కొట్టి తన హీరోయిజం చూపిస్తాడు. కానీ నిజజీవితంలో అలా జరగదు. అది సింహమైనా సరే.. ఒంటిరిగా వెళితో చావే గతి. దానికి ఉదాహరణే ఈ వీడియో. వేట కోసం గేదెల గుంపుపై దాడి చేసిన సింహాన్ని ఆ గెదెల గుంపంతా కలిసి ఫుట్‌బాల్ ఆడేసింది. వందకు పైగా ఉన్న గేదెలు తమ కొమ్ములతో సింహాన్ని చీల్చి చెండాడేశాయి. అత్యంత దారుణమైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అడవికి రాజు అయిన సింహం పంజా పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింహం పంజా పడిదంటే ఏ జంతువైనా మట్టి కరవాల్సిందే. సింహం గర్జన వినిపిస్తేనే జంతువలన్నీ వణకిపోతాయి. పిక్కబలం చూపించి పారిపోతాయి. కానీ ఓ సింహంపై దాడి చేసి క్రూరంగా వేరే జంతువులు చంపిన ఘటనలు ఎప్పుడైనా చూశారా..?  లేకపోతే ఇప్పుడు చూడండి. ఓ గేదెల మందపై దాడి చేసిన సింహాన్ని ఆ మందలోని గేదెలన్నీ కలిసి చంపేశాయి. సింహం కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండడాన్ని గమనించి కొన్ని గేదెలు తిరిగి దానిని చనిపోయేవరకు కుమ్మి చంపేశాయి.

నది ఒడ్డున పెద్ద సంఖ్యలో గేదెలు ఉండగా.. అదే సమయంలో ఎలా వచ్చిందో ఓ సింహం వాటి మధ్యలోకొచ్చి ఇరుక్కుపోయింది. ఇక అంతే ఆ గేదెలన్నీ కలిసి సింహాన్ని తమ కొమ్ములతో గాలిలో ఎగరేసి చీల్చి పారేశాయి. గేదెల కొమ్ముల దెబ్బకు సింహం కడుపు భాగం చీలిపోయింది.  కసితీరా ఆ సింహాన్ని చంపేసిన గేదెలు దాని పక్కనే తిరగడాన్ని వీడియోలో గమనించవచ్చు. సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫామ్‌లలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. ‘లైఫ్ అండ్ నేచర్’ అనే ఖాతాతో ఈ వీడియో ట్విట్టర్‌లో షేర్ అయింది. దీనిపై నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. ‘ఐకమత్యంగా ఉండబట్టే ఆ గేదెలకు అంత స్టామినా వచ్చిందని, అందుకే అంతా కలిసి ఉండాలని కొందరు కామెంట్లు చేస్తుంటే.. మరి కొందరు మాత్రం తెలివి లేని సింహం.. ఎంత రాజైతే మాత్రం గుడ్డిగా దాడి చేస్తే ఇలానే జరుగుతుంది అంటూ రాసుకొస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: