అది కూడా కిలో లేదా రెండు కిలోలు అనుకుంటే మాత్రం పొరపాటే.. కేవలం ఒకే ఒక్క ముక్క ధర డెబ్బై మూడు లక్షలు.. ఏంటి అవాక్కయ్యారు కదా.. బంగారు కోడిని కోసి అమ్మిన అంత ధర పలకదేమో అని అనుకుంటారు ఎవరైనా.. మరి ఈ చికెన్ ముక్క ఏకంగా డెబ్బై మూడు లక్షలు పలకడానికి కారణం ఏంటి.? అసలు ఈ చికెన్ యొక్క ప్రత్యేకత ఏంటి తెలుసుకుందాం. ప్రస్తుతం చికెన్ వంటకాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మేక్ డొనాల్స్ ఇక ఇప్పుడు తమ చికెన్ నగ్గెట్ తో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవలే మెక్ డొనాల్డ్స్ ప్రత్యేకంగా ఒక చికెన్ నగ్గెట్ ను తయారు చేయగా దీని ధర ఏకంగా 99997 డాలర్లు పలికింది. ఇక ఇది భారత కరెన్సీలో అక్షరాల 73 లక్షలు.
ఇంత భారీ ధర సరే... అసలు ఇంత డిమాండు ఉండడానికి ఆ చికెన్ ప్రత్యేకత ఏంటి అని అంటారా.. 'అమాంగ్ అస్ 'అనే ఒక వీడియో గేమ్ లోని ఓ పాత్ర ఆకారంలో ఈ చికెన్ తయారు చేసింది మెక్ డొనాల్స్. ప్రస్తుతం ఈ గేమ్ ఎంతో పాపులర్ లో ఉంది. ఈ క్రమంలోనే ఈ గేమ్ ఆడే ప్రతి ఒక్కరూ కూడా ఈ చికెన్ నగెట్ ను సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ చికెన్ నగ్గెట్ ను ఆన్లైన్లో పెట్టగానే అందరూ ఎగబడి పోయారు. దీంతో నిర్వాహకులు ఊహకందని విధంగా రెస్పాన్స్ వచ్చింది. చివరికి ఇక ఆ చికెన్ ముక్కను ఉటా కు చెందిన పోలిజ్ఞ అనే వ్యక్తి 73 లక్షలు చెల్లించి కొనుగోలు చేశాడు. ఏదేమైనా ఒక చికెన్ ముక్క కోసం 73 లక్షలు చెల్లించడాన్ని మాత్రం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి