సాధారణంగా ఎవరైనా వారిదగ్గరున్న వాహనం కి ట్రాఫిక్ పోలీసులు జరిమానా వేశారంటే తెగ కంగారు పడిపోయి చలన కట్టేవరకు నిద్రపోరు. ఆ జరిమానా కట్టిన తరువాతే వారికీ ప్రశాంతంగా ఉంటుంది కూడా. అయితే
హైదరాబాద్ కి చెందిన ఓ వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంగిస్తూ పోలీసులకు టోకరా వేశాడు. ఏకంగా 117 చలాన్లు పెండింగ్ లో పెట్టాడు .
హైదరాబాద్ నాంపల్లి కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా వాహనాలు తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో అతని వాహనం ను సీజ్ చేశారు. ఆన్లైన్ లో ఆ
బైక్ నుంబర్ ని ఎంటర్ చేసినప్పుడు
పోలీస్ అధికారులకు ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు. ఆ
బైక్ పై ఏకంగా పెండింగ్ లో ఉన్న 117 చలాన్లు ఉన్నట్లు వారు గుర్తించారు.

వివరాలలోకి వెళితే ఫరీద్ ఖాన్ అనే వాహనదారుని పేరుమీదున్న ఏపీ09 ఏయూ 1727 అనే నెంబర్ గల హోండా యాక్టివాపై నమోదైన చలాన్లు చూసి ఒక్కసారిగా
పోలీస్ అధికారులు షాక్ కి గురి అయ్యారు . అయితే ఆ మొత్తం చలనాలపై రూ. 3 లక్షల వరకు జరిమానా విధించినా ఎగవేత చేసినట్లు తెలుస్తూవుంది. అయితే
పోలీస్ లు అతడిని పరీక్షించినప్పుడు అతడు ఏఒక్క ఫొటోలోని హెల్మెట్ లేకుండానే కనిపించదు. అంతేకాకుండా కరోనా సమయం లో మోడీ ప్రభుత్వం లాక్ డౌన్ ని చాలా స్ట్రిక్ట్ గా అనుసరించింది.
అయితే
కరోనా మహమ్మారి సమయం లో అతడు మాస్క్ కూడా ధరించకుండా ప్రయాణం చేశాడు. దింతో ఆ స్కూటీ ని వెంటనే
పోలీస్ అధికారులు సీజ్ చేశారు. తాజాగా అతడి ఫోటోను
పోలీస్ అధికారులు రిలీజ్ చేశారు. అయితే ఫరీద్ ఖాన్ 2015 నుండి చలనాలను కట్టకుండా పెండింగ్ లో పెట్టాడు. చలానాలు మొత్తం కట్టవలసింది గా అతడికి నోటీసు లు కూడా ఇచ్చింది