సోషల్‌ మీడియా ప్రపంచంలో ప్రతిరోజు కూడా చాలా వీడియోలు బాగా వైరల్‌ అవుతుంటాయి. అందులో జంతువులకి సంబంధించిన వీడియోలని నెటిజన్లు బాగా లైక్ చేసి చూస్తారు. షేర్స్, కామెంట్స్‌ చేస్తూ బాగా హోరెత్తిస్తారు.ఇక సాధారణంగా ఇలాంటి వీడియోలకి ఆదరణ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తాజాగా చిరుతపులికి సంబంధించిన ఒక వీడియో అయితే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్లు అంతా కూడా దెబ్బకు షాక్‌ అవుతున్నారు. సాధారణంగా చిరుత పులి బాగా వేటాడే జంతువు. ఏ మాత్రం అవకాశం దొరికినా కానీ అస్సలు వదిలిపెట్టదు. ఎరని పట్టుకోవడంలో చిరుత పులి అనేక రకాల  టెక్నిక్స్‌ ని ఉపయోగిస్తుంది. వేటాడే జంతువులలో ఇది చాలా తెలివైన జంతువుని చెప్పాలి. ఇక ప్రస్తుతం వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఇక ఈ షాకింగ్ వీడియో ఒక గ్రామంలో జరిగింది. చుట్టు చక్కగా అందమైన చెరకు పంట ఉంటుంది. ఈ ప్రాంతం నివాసాలకు సమీపంలో ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. 



ఈ క్లిప్‌లో చిరుతపులి వేట కోసం చెట్టుపైకి మాటువేసి ఉన్నట్లు చూస్తుంటే తెలుస్తోంది. అయితే చాలాసేపు ఎదురు చూసి ఏది కనిపించకపోయేసరికి అది కిందికి దిగుతుంది. అయితే అది చెట్టుదిగే పద్దతి చూస్తే ఎవరైనా కాని ఔరా అంటూ ఆశ్చర్యపోవాల్సిందే. సాధారణంగా ఒక మనిషి ఏ విధంగానైతే చెట్టు దిగుతాడో చిరుత పులి కూడా అలాగే దిగుతుంది. చిరుతపులి చెట్లు ఎక్కడంలో చాలా ఎక్సపర్ట్‌ అని తెలిసిన విషయమే. మిగతా వేటాడే జంతువులకి దీనికి చాలా తేడా ఇదే. అందుకే దీని కంటపడితే ఏ జంతువైనా సరే దానికి ఆహారం కావాల్సిందే.ఈ వీడియోని ఐఎఫ్ఎస్ రమేష్ పాండే తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. ఈ వార్త రాసే దాకా ఈ వీడియోకి వేలల్లో వ్యూస్‌ వచ్చాయి. వీడియో చూసిన తర్వాత జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు. అయితే ప్రజలు ఇంకా అలాగే వీధి కుక్కల కారణంగా చిరుతపులి చెట్టుపైకి ఎక్కి ఉంటుందని నెటిజన్లు కామెంట్ లు కూడా చేస్తున్నారు. మీరు ఈ వీడియోని చూసినట్లయితే మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: