మనిషి జీవిత కాలం 100 ఏళ్లు, ఇది ఆరోగ్యంగా ఉంటే వచ్చే లెక్క. మరి ఆరోగ్యంగా , పుష్టిగా సంతోషంగా జీవిస్తే అంతకు మించే బ్రతికేయవచ్చు, ఇప్పటికే చాలా మంది 100 ఏళ్లకు మించి బ్రతికి ఆశ్చర్యపరిచిన వారు ఉన్నారు.
ఒకప్పుడు అయితే ఎక్కువ మంది 80,90 ఏళ్లు వరకు బ్రతికే వారు.. కానీ ఇప్పటి రోజుల్లో 60 ను క్రాస్ చేయడమే కనా కష్టమైపోతోంది.  100 ఏళ్లు జీవించే వారు నూటికో, కోటికో ఉంటున్నారు. ఈ ఫాస్ట్ జనరేషన్ లో అన్నేళ్లు బ్రతికితే వారిని వింతగా చూస్తూ ఆశ్చర్య పోతున్నారు. నిజమే కదా ప్రస్తుత రోజుల్లో అన్నేల్లు బ్రతకడం అంటే వింతే మరి. మారిన కాలంతో పాటు ఆహారపు అలవాట్లు, జీవన శైలి కూడా ఎంతగానో మారింది. కుటుంబ భారం, పని,వ్యాపారం అంటూ ఇలా అన్ని వైపుల నుండి మనిషిపై ఒత్తిడి బాగా పెరుగుతున్న నేపథ్యం లో మనిషి అనారోగ్య పాలవుతున్నారు.

అందుకే చాలా మంది జబ్బుల భారిన పడి అకాల మరణం చెందుతున్నారు. అయితే ఒక ప్రాంతం లోని వారు మాత్రం 100 ఏళ్లకు పైగా జీవిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.  ఏమిటి 100 ఏళ్లకు పైనే ఇంతకీ ఎక్కడా...ఎవరు అని తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారా...అయితే వివరాలు చూడండి. జపాన్ లోని ఒకినావా అనే దీవికి చెందిన ప్రజల సగటు ఆయుర్దాయం.. దగ్గర దగ్గర 100 ఏళ్లకు పైగానే ఉంది. సైంటిస్టులు అక్కడి ప్రజలపై చేసిన అధ్యయనాల నివేదికలు ఇది నిజమని చెబుతున్నాయి. ఒకినావా దీవి స్త్రీలు అయితే  కనీసం 86 ఏళ్లకు పైనే జీవించగా.. పురుషులు 80  ఏళ్లకు పైగా బతుకుతారట.  చాలా మంది 100 ఏళ్లకు పైగానే బ్రతికేస్తారట.  ప్రపంచంలోనే అత్యధిక ఆయుర్దాయం గల ప్రజలు ఉన్న ప్రాంతాల్లో ఇది టాప్ ప్లేస్‌లో ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఇక్కడి ప్రజల జీవిత కాల రహస్యం ఏమిటి ? అంటే పసుపు అని చెబుతున్నారు.

అవును.. పసుపు వల్లే వారు ఇన్నేళ్ల పాటు జీవించగలుగుతున్నారట. అక్కడి ప్రజలు రోజు అర టీస్పూన్ పసుపుకు అంతే మోతాదులో మిరియాల పొడిని కలిపి తిని దానితో పాటుగా గోరు వెచ్చని నీళ్లను తాగుతారట. అందుకే వారు అన్నేళ్లు యవ్వనంగా బ్రతుకుతున్నారు. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు  అధికంగా ఉంటాయన్న విషయం తెలిసిందే కాగా నిత్యం తీసుకోవడం వలన వారికి ఆరోగ్యం మెరుగ్గా ఉంటందట.

మరింత సమాచారం తెలుసుకోండి: