బ్రిటిష్ వాళ్ల ఉద్దేశంలో మన భారతీయులంటే దాస్యం చేసే బానిసలతో సమానం.  వాళ్ళ అహంకారాన్ని మనం 200 ఏళ్లు అనుభవించవలసి వచ్చింది. ఎన్ని ఏళ్ళు పోయినా కానీ బ్రిటన్  వాళ్ళ అహంకారం ఇంకా అలాగే ఉందని తాజా సంఘటన నిరూపిస్తుంది. తాజాగా బ్రిటన్ లో తాను డెవిల్ అని చెప్పుకుంటూ ఒక ఆమె ఏడుగురు చిన్న పిల్లల ప్రాణాలు తీసింది. మరొక ఆరుగురు చిన్న పిల్లల ప్రాణాలను  తీయడానికి ప్రయత్నిస్తుండగా ఆమె ప్రయత్నాన్ని  అక్కడ ఉన్నటువంటి భారతీయ డాక్టర్ కనిపెట్టాడట.


అయితే ఆ డాక్టర్ ఆ అమ్మాయిని పట్టుకుని హాస్పిటల్ లో కంప్లైంట్ ఇచ్చాడట. కానీ ఆ దేశం వాళ్లు ఈ డాక్టర్ భారతీయుడు అవ్వడంతో తమ దేశస్తురాలు అయిన ఆ అమ్మాయికి సారీ చెప్పమని చెప్పారట. వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా ఒక బ్రిటన్ నర్స్ చేసిన ఘాతకం ఇప్పుడు సంచలనం అయ్యింది. చెస్టర్ కౌంటర్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్ లో 2015-16 లో ఈ ఘాతకం చోటు చేసుకుందని తెలుస్తుంది.


నవజాత శిశువుల విభాగంలో పనిచేస్తున్న లూసి లెంతి అనే బ్రిటిష్ ఈ దుర్మార్గాన్ని చేసినట్లుగా తేలడంతో ఆమెను అరెస్టు చేశారు. భారతీయ సంతతికి చెందిన డాక్టర్ రవి జయరామ్, ఇతర డాక్టర్లు చేసిన కంప్లైంట్ ఆధారంగా ఈమెను అరెస్టు చేశారని తెలుస్తుంది. రవి జయరాం మాట్లాడుతూ 2017లో ముగ్గురు నవజాత శిశువులు మరణించారని ఆ తర్వాత ఆ ప్రదేశంలో లూసీ అనుమానాస్పదంగా కనబడడంతో అసలు విషయం బయటకు వచ్చిందని ఆయన చెప్పాడు.


ఇంజక్షన్ ద్వారా శిశువుల రక్తంలోకి గాలిని పంపడం, నాసో గ్యాస్టిక్ గొట్టాల ద్వారా వాళ్ల కడుపులోకి నీటిని, పాలను బలవంతంగా పంపడంతో శిశువుల శ్వాస నాళాల్లో  ఇబ్బంది ఏర్పడి ఆ శిశువులు అందరూ చనిపోయారని తెలుస్తుంది. హాస్పటల్ సిబ్బంది ముందుగానే చర్య తీసుకుని ఉంటే మరొక నలుగురు పిల్లలైనా బ్రతికి ఉండేవారని అంటున్నారు ఆ డాక్టర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: