మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక నగరాన్ని సైతం చాలామంది చూడాలని కలలు కంటూ ఉంటారు. అయితే ఈ ద్వారకా నగరం ఉందా లేదా అనే విషయంపై కూడా చాలా మంది పలు రకాల అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. ద్వారకా సబ్ మెరైన్ టూరిజం ప్రాజెక్టును గుజరాత్ ప్రభుత్వం చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. అరేబియా సముద్రంలో మునిగిపోయిన ఈ నగరాన్ని సైతం చూసేందుకు చాలా మంది భక్తులు సముద్ర మార్గంలో తీసుకువెళ్లబోతున్నట్లు గుజరాత్ ప్రభుత్వం తెలియజేసింది. అయితే వచ్చే సంవత్సరం శ్రీ కృష్ణాష్టమి లేదా దీపావళి పండుగ సందర్భంగా ఈ యాత్రను మొదలుపెట్టబోతున్నారట.


ఈ పర్యటనకు సంబంధించి సబ్ మెరైన్ లలో తీసుకెళ్లడం ద్వారా దేశ పర్యటనలో ఇదే మొదటిసారి ప్రభుత్వం చేపడుతున్నదని చెప్పవచ్చు. అయితే ఇది అరేబియా సముద్రంలో 300 అడుగుల లోతులో ఉన్న ద్వారకా నగర కట్టడాలను పురాతన ఆలయాలను చూసేందుకు సబ్ మెరైన్ ఉపయోగించి భక్తులు చూడవచ్చని గుజరాత్ ప్రభుత్వం తెలియజేసింది.. ఇందు కోసం రెండు గంటల దర్శనం యాత్రను కూడా నిర్వహించబోతున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇందుకు సంబంధించి.. మజ్ గావ్ డాక్ షిప్ యార్డ్ కంపెనీతో ఒప్పందం కూడా కుదుర్చుకుందట.

రెండు గంటలపాటు సబ్ మెరైన్ యాత్ర ఉండబోతోందని తెలియజేశారు. ఈ ట్రిప్పులో 24 మంది పర్యటకులకు ఈ సబ్ మెరైన్ లో తీసుకువెళ్తారని గుజరాత్ ప్రభుత్వ టూరిజం శాఖ తెలియజేసింది. ఇందులో ఆరుగురు సిబ్బంది ఉంటారని ఆ రాష్ట్ర టూరిజం శాఖ తెలియజేయడం జరిగింది. దీంతో శ్రీకృష్ణుని అభిమానులు  సైతం ఇక మీదట ద్వారకా నగరాన్ని చూడవచ్చు అంటూ చాలా ఆనందాన్ని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా శ్రీకృష్ణునికి సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా మరింత క్షుణ్ణంగా పరిశీలించవచ్చు అంటూ మరి కొంతమంది పరిశోధకులు తెలియజేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ టూరిజం సైతం ప్రారంభించే విధంగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: