
ఇప్పుడు పాకిస్తాన్ భారత్ ల మధ్య పరిస్థితి చాలా చాలా హాట్ గా మారిపోయింది. అయితే పాకిస్తాన్ పంపే మిస్సైల్స్ ని..డృఓన్స్ ను గాల్లోనే తిప్పి కొడుతుంది ఇండియన్ ఆర్మీ. తిండి నిద్ర లేకుండా 24/7 భారత్ ఆర్మీ భారత ప్రజల కోసం భారత ప్రజలకు క్షేమంగా ఉండడం కోసం కష్టపడుతుంది . కాగా ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ లో మాత్రం సీన్ వేరేలా ఉంది . పాకిస్తాన్ లో సామాన్య ప్రజల పరిస్థితి చాలా చాలా దారుణంగా మారిపోయింది . ఇదే సమయంలో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు మొత్తం పూర్తిగా కుప్పకూలాయి . అక్కడ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది . అత్యవసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటేస్తున్నాయి.
మరీ ముఖ్యంగా చికెన్ - పాల ధరలు అయితే తారస్థాయికి చేరుకున్నాయి . పాకిస్తాన్ లో చికెన్ ధరలు ప్రస్తుతం ఆసక్తికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి . మరీ ముఖ్యంగా కొన్ని ప్లేసెస్ లో చికెన్ ధర వెయ్యి రూపాయలు దాటేసింది. ఒకవైపు ఆర్థిక సంక్షోభం ద్రవయోల్పణం కారణంగా నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటిపోతున్నాయి అంటూ లభోధిబో అని పాకిస్తానీలు అల్లాడిపోతున్నారు . కాగా పాకిస్తాన్ లో ఇప్పుడు కేజీ చికెన్ ధర దాదాపు 900 కు పైగానే ఉంది. అదే బోన్లెస్ చికెన్ అయితే 1200 దాటేసింది .
పౌల్ట్రీ వ్యాపారులు మూతపడడం ప్రధాన కారణం అని తెలుస్తుంది. అంతేకాదు కోళ్ల దానాకు తీవ్ర కొరత ఏర్పడడంతో కూడా ఈ వ్యాపారం చాలామంది నిలిపివేశారు. దీంతో పాకిస్తాన్ ప్రజలకు ఇప్పుడు చికెన్ దొరకడం మరింత కష్టమైపోయింది. అయితే దీని పట్ల సోషల్ మీడియాలో రకరకాల మీమ్‌స్ ట్రెండ్ అవుతున్నాయి . పక్కనోడి లైఫ్ను నాశనం చేయాలని చూస్తే మీ లైఫ్ మీరే నాశనం చేసుకుంటారు ..దానికి ఇదే బిగ్ ఎగ్జామ్పుల్ . సైలెంట్ గా ఉన్న ఇండియాను గెలికారు ఇప్పుడు మీ దేశాన్ని మీరే చీదురించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు అంటూ ఘాటుగాటుగా మీమ్‌స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఈ పాకిస్ధానీలు ఏం తిని బ్రతుకుతారో..?? అంటూ వెటకారంగా కూడా కౌంటర్స్ పడుతున్నాయ్..!