ఈ జీవితం అనేది ఆ భగవంతుడు సృష్టించిన ఒక అందమైన మాయ అని చెప్పాలి. ఎందుకంటే ఈ దేహమే ఒక అద్భుత సృష్టి. మన జీవితమే ఎన్నో సమస్యల సుడిగుండం. ఈ సమస్యలను అన్నింటినీ ఎదురీది ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలి అంటే అంత ఈజీ కాదు. అయితే ఒక లక్ష్యానికి మనము చేరువ కావాలంటే మధ్యలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని మనకు మంచిని కలిగించి మన విజయానికి కారణం అవుతాయి. మరి కొన్ని మాత్రం మన విజయానికి అడ్డంకిగా మారుతూ ఇబ్బందులు కలిగిస్తాయి. అయితే అన్నింటినీ మనతో పాటు క్యారీ చేయడం మంచి పద్దతి కాదు. అందుకే అన్నింటినీ గుర్తుంచుకుని బాధ పడకుండా సాఫీగా జీవితాన్ని సాగించాలి.

ఒక విషయం తెలుసా...!! సంతోషాన్ని నింపి మనలో ఉత్సాహాన్ని పెంచే మధురమైన జ్ఞాపకాలు మనల్ని విజయం వైపు నడిపిస్తాయి. అదే విధంగా దుఃఖంతో గుండెను తడిపి బాధ పెట్టే చేదు జ్ఞాపకాలు మనల్ని నిస్సహాయులుగా చేసి లక్ష్యానికి దూరం చేస్తాయి. ఇవి రెండూ మన దగ్గరే ఉంటాయి, అలాగే వేటిని ఎంచుకోవాలి అన్న నిర్ణయం కూడా మన చేతిలోనే ఉంటుంది. అలాంటప్పుడు చేదు అనుభవాలతో కలత చెందడం కన్నా తీపి జ్ఞాపకాల స్మృతులతో భవిష్యత్తు వైపుకు ఆనందంగా సాగడం మిన్న.  ఏది ఏమైనా ఏది ఎంచుకోవాలో మీ చేతిలో ఉన్న అంశమే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. మన లైఫ్ ఎలా ఉండాలో మనమే డిసైడ్ చేసుకోవాలి.

అలాగే కర్మ ను బట్టి అన్నిటినీ స్వీకరించగలగాలి అదే విధంగా మంచి  మార్గాన్ని ఎంచుకుని లక్ష్యాన్ని చేరుకోవడం విజయం అవుతుంది. కాబట్టి మీకు మంచిని మరియు విజయాన్ని కలిగించే ఆలోచనలను, మధురానుభూతులను, స్మృతులను మాత్రమే మీతో ఉండనివ్వండి. మిగిలిన చెత్త ఆలోచనలు, గతంలో జరిగిపోయిన చేదు వార్తలు అన్నింటినీ వదిలేసి ముందుకు సాగాలి. అప్పుడే నిజమైన జీవితాన్ని మీరు అనుభవించగలుగుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: