విజయం అంటే ఆర్థికంగా స్థిరపడటమో? అనుకున్న ఉద్యోగం సంపాదించడం మాత్రమే కాదు మనతో ఉన్న వారిని సంతోషంగా ఉండేలా చూసుకోవడం కూడా విజయమే అవుతుంది. ఇది చాలా చిన్న జీవితం. రోజులు లెక్కపెట్టుకుంటూ పోతే చాలానే ఉంటాయి. కానీ ఎవరి లైఫ్ ఎంత అనేది ఏమి గ్యారంటీ లేదు. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలి, మనతో ఉన్న వారిని ఆనందంగా ఉండేలా చేయాలి. అంతకు మించిన విజయం మరొకటి ఉండదు అని అంటుంటారు. సౌకర్యవంతంగా జీవించడానికి డబ్బు అవసరమే కాదనటం లేదు. కానీ అన్ని విషయాలను డబ్బుతో ముడిపెట్టి చూడకండి.

మన లక్ష్యాలు దాదాపుగా.. చివరాఖరికి బాగా డబ్బులు సంపాదించి సెటిల్ అవ్వడానికి అన్నట్లుగా ఉంటాయి. వాస్తవమే కానీ ఇక్కడ లక్ష్యం యొక్క అర్దం సంతోషం. మరి అలాంటప్పుడు కోట్ల ఆస్తి ఉన్నా సంతోషంగా జీవించలేనపుడు ఎంత సంపాదించి ఏమి లాభం. మనలో చాలా మంది 24/7 ఆర్థికంగా స్థిరపడటానికి పరుగులు తీస్తూ చిన్న చిన్న ఆనందాలను మీ కుటుంబ సభ్యుల ఆప్యాయతలకు దూరం అవుతున్నారు. ఇప్పటికైనా కాస్త ఆలోచించండి మీరు కోరుకున్న జీవితంలో మీరు ఉన్నారా ? మీ కుటుంబ సభ్యులు మీ వల్ల సంతోషంగానే ఉన్నారా ? లోపం ఎక్కడ ఉంది ? కేవలం ధనం మాత్రమే జీవితం, ధనవంతులు అయితేనే విజయం అందుకున్నట్లా ?

ఇలా ఒక్కసారి మీరు శాంతంగా ఆలోచిస్తే తేడా మీకే అర్దం అవుతుంది. విజయానికి సరైన సమాధానం దొరుకుతుంది.  ఖచ్చితంగా నిజమైన జీవితం అంటే డబ్బు ఆస్తులు కాదు. నీ కోసం ఇంటి దగ్గర ఎదురు చూసే నలుగురు మనుషుల కళ్ళలో సంతోషాన్ని నింపడం మాత్రమే అవుతుంది. ఏ ఒక్క రోజు అయినా వారి కళ్ళల్లో సంతోషం మిస్ అయితే అది ముమ్మాటికీ మీ ఫెయిల్యూర్ అవుతుందే తప్ప విజయం అయితే కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: