ఈ మధ్య కాలంలో సమాజం పోకడ చూస్తుంటే దేనికి దారి తీస్తుందో అర్థం కావడం లేదు. వయసు తేడా లేకుండా ప్రేమించుకోవడం, చిన్నా పెద్ద అనే తేడా లేకుండా డేటింగ్ లు చేయడం వంటివి మనం సమాజంలో చూస్తూన్నాం. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ఈ వయసు తారతమ్యం అసలు చూడడం లేదు. పెళ్లి అయినా కాకున్నా డేటింగ్ అంటే ఇట్టే వెళ్ళిపోతున్నారు అందరూ. మరి ఈ రకమైన సంప్రదాయం భారత దేశంలోకి అడుగు పెడితే ఈ దేశం విచ్ఛిన్నం కావడమే అని అంటున్నారు కొంత మంది పండితులు. 

తనకంటే చిన్న వయసు ఉన్న వాడితో డేటింగ్ చేసేందుకు చాలామంది వృద్ధురాల్లు ఇష్టపడుతున్నారు. వినడానికి ఇది సరదాగా ఉన్నా ఇది నిజం. 48 ఏళ్ల క్రితం విడాకులు అయిన నాటి నుంచి ఇప్పటివరకు తనకంటే చిన్న వయసు లోనే వారితో డేటింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నాను అంటుంది న్యూయార్క్ కి చెందిన 84 ఏళ్ల వృద్ధురాలు. ఈ మధ్యనే 39 సంవత్సరాల తన బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిన ఆ మహిళ మరొకసారి బాయ్ ఫ్రెండ్ కోసం బంబుల్ అనే డేటింగ్ యాప్ లో తన ప్రొఫైల్ ను పోస్టు చేసింది. 

ఈ వయసులో కూడా ఇన్ని కోరికలు ఏంటి.. ఎవరు ఆమె ఆసక్తిగా చూస్తున్నారా.. ఆమె పేరు హాట్టి రెట్రోజ్. న్యూయార్క్ లో నివసిస్తున్న ఈ 84 ఏళ్ల వృద్ధురాలు ఇటీవలే తన 39 సంవత్సరాల బాయ్ ఫ్రెండ్ తో విడిపోగా కొత్త బాయ్ ఫ్రెండ్ కోసం ఓ డేటింగ్ యాప్ లో తన ప్రొఫైల్ పోస్ట్ చేసిందట. పిల్లలను కనీసం కాలేజీ చదువుల కోసం కూడా పంప లేని తన మొదటి భర్త నుంచి 1984లో విడాకులు తీసుకున్న హట్టి ఒకానొక సందర్భంలో బాయ్ ఫ్రెండ్  కావాలంటూ ఒకానొక సందర్భంలో  పేపర్ యాడ్ కూడా ఇచ్చింది. తనకంటే చిన్న వయసు ఉన్న యువకులతో డేటింగ్ లకు కు వెళుతున్న ఇద్దరు కూతుళ్లు ముగ్గురు మనవరాళ్లు ఉన్న ఈ ముద్దుల బామ్మ ఈ మధ్యనే ఇజ్రాయిల్ నుంచి కూడా తనకు డేటింగ్ ప్రపోజల్స్ వచ్చినట్లు సిగ్గుపడుతూ చెబుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: