ఆరుద్ర అస‌లు పేరు భాగవతుల సదాశివ శంకరశాస్త్రి. ఆరుద్ర'గా కలం పేరుతొ ప్రసిద్ధుడ‌య్యారు. తెలుగు సాహిత్య చరిత్రలో ఒక సముచిత స్థానాన్నిసంపాదించుకున్న మహానుభావుడు. ఇతను 'ఆరుద్ర' కాడు, 'ఆరో రుద్రుడు' అని శ్రీశ్రీ చేత కొనియాడ‌బ‌డిన క‌వి ఆయ‌న‌.   శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త, విమర్శకుడు. ఆరుద్ర మహాకవి శ్రీశ్రీకి బంధువు. ఆరుద్ర 1925,ఆగష్టు 31న విశాఖపట్నంలో జన్మించారు. ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా తెలుగు రచయిత్రి. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాలలో, తర్వాత విజయనగరంలో యం.ఆర్.కళాశాలలో చ‌దువు పూర్తి చేశారు.  


క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ త‌ర్వాత వివి ధ కార‌ణాల‌తో చ‌దువుపై ఆయ‌న‌కు పెద్ద‌గా ఆస‌క్తి క‌ల‌గ‌లేదు. 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశారు. సంగీతంపై ఆస‌క్తి పెర‌గ‌డంతో  1947-48 లో చెనై నుంచి వెలువడే వారపత్రిక ' ఆనందవాణి 'కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ, చిత్త‌నూరు బాలాజీ, ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం రేపాయి. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వ్యవస్థాపకుల్లో  ఆరుద్ర ఒకరు. త్వమేవాహం - 1948. ఇది ముఖ్యమైన తెలుగు రచనలలో ఒకటి. తెలంగాణా నిజాం పాలనలలో జరిగిన రజాకార్ల అకృత్యమాలు ఈ రచన నేపథ్యం. మృత్యువు ఒక వ్యక్తితో నువ్వే నేను  అంటుంది. ఒకచోట రచయిత సమాజంలోని ఘటనలను, దృక్పధాలను ఊహాజనితమైన గడియారంతో పోలుస్తాడు.


1949లో బీదల పాట్లు అన్న చిత్రంలో .. " ఓ చిలుకరాజా నీ పెళ్లెప్పుడు ' అనే పాట‌తో ఆయ‌న సినీ గేయ ర‌చయితీ జీవితాన్ని ఆరంభించారు. ఆ త‌ర్వాత ఆయ‌న  క‌లం నుంచి దాదాపు నాలుగువేల సినిమా పాటలు జాలువారాయి.  వీటి సంకలనాలు ఆరుద్ర సినీ గీతాలు పేరుతో ప్రచురితమయ్యాయి. మొదలగు సినిమా పాటలు వ్రాసి పాటకు ఒక అర్థాన్ని పరమార్థాన్ని ప్రసాదించి ప్రతిపాటలో తన ముద్రను చూపేవాడు. రుద్ర‌కు 1985లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ (గౌరవ డాక్టరేట్) ప్రదానం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: