కార్ల కంపెనీలు పోటీ పడి మరి కొత్త కార్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు..రోజుకో కంపెనీ కార్లు సరికొత్త ఫీచర్స్ తో పాటుగా సరసమైన ధరలకు కూడా అందిస్తున్నాయి. తాాజాగా కియా సొనెట్ కంపెనీ తన మూడో రకం కార్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఆ కారు చాలా ప్రత్యేకతలను కలిగి ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.. కియా సోనేట్ కార్లు మొదట వచ్చిన రెండు రకాలు మాత్రం జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఈ నేపథ్యంలో మరి కొన్ని ఫీచర్లతో కొత్త కారును మార్కెట్ లోకి విడుదల చేశారు.



ఎన్ 29 ఎయిర్ ఫిల్టర్‌తో తీసుకువచ్చిన ప్రపంచంలోనే మొదటి కారు ఈ కియా సొనెట్. ఆటోమేటిక్ ఎయిర్ ప్యూరిఫైయర్ తో పాటుగా ఆటోమేటిక్ స్టార్ట్ మరియు స్టాప్ పేసిలిటిని కలిగి ఉంటుంది.ప్యూరిఫైయర్‌లో ఇన్‌బిల్ట్ పెర్ఫ్యూమ్ కూడా ఉంది.యువివో కనెక్టెడ్ కార్ టెక్నాలజీని కియా సొనెట్‌లో ఇచ్చారు. దీనికి 57 యువివో కనెక్ట్ ఫీచర్లు ఉన్నాయి. వీటి ద్వారా సొనెట్‌లోని వాయిస్ కమాండ్స్, మొబైల్‌లోని యాప్ ద్వారా 57 ఫీచర్స్ ను సులువుగా పొందవచ్చు. కియా సొనెట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంది. దీని వల్ల  కారు టెక్నాలజీని చూపిస్తుంది.



ఇక ఈ కారు ఆరు వెరియంట్లలో అందుబాటులోకి వచ్చింది..-లైన్, టెక్ లైన్, ట్రిమ్ కింద ఉన్నాయి. అవి హెచ్‌టిఇ, హెచ్‌టికె, హెచ్‌టికె , హెచ్‌టిఎక్స్, హెచ్‌టిఎక్స్్, జిటిఎక్స్ వెరియంట్లు ప్రస్తుతం మార్కెట్ లో ఉన్నాయి. ఈ కారు ప్రత్యేకతల విషయానికొస్తే..6 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్‌ విత్ ఇబిడి, ట్రాక్షన్ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్, రియర్ పార్కింగ్ సెన్సార్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, సెగ్మెంట్ ఫస్ట్ 360 డిగ్రీ కెమెరాను కలిగి ఉంటుంది.1.5 లీటర్ ఇంజన్ తో పాటుగా 3 ప్రత్యేకమైన ఇంజన్లు కూడా ఉన్నాయి.6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్  ను కూడా కలిగి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: