ప్రస్తుతం మనలో చాలా మంది కూడా జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం ఇంకా జుట్టు పెరగడకపోవడం వంటి వివిధ రకాల జుట్టు సంబంధిత సమస్యలతో ఎంతగానో బాధపడుతున్నారు. వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి ఇంకా అలాగే ఆందోళన వంటి చాలా రకాల కారణాల వల్ల జుట్టు సంబంధిత సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడే వారు ఇంట్లోనే కేవలం రెండు పదార్థాలను ఉపయోగించి వాటితో నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల జుట్టును ఒత్తుగా ఇంకా అలాగే అందంగా మార్చుకోవచ్చు.ఇక మీ జుట్టును ఒత్తుగా మార్చే ఈ నూనెను తయారు చేసుకోవాలి? ఇంకా దాని గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నూనెను తయారు చేసుకోవడానికి  మనం కొబ్బరి నూనెను ఇంకా కాళోంజి విత్తనాలను ఉపయోగించాల్సి ఉంటుంది. కాళోంజి విత్తనాలలో చాలా పోషకాలు, ఆమైనో యాసిడ్లు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలలో చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే జుట్టును ఒత్తుగా, పొడవుగా, నల్లగా పెరగడంలో కాళోంజి విత్తనాలు మనకు చాలా బాగా సహాయపడతాయి.ఇంకా అలాగే కొబ్బరి నూనెలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలలో బాగా సహాయపడతాయి. కొబ్బరి నూనెను వాడడం వల్ల జుట్టు పొడవుగా, ఒత్తుగా ఇంకా ఆరోగ్యంగా పెరుగుతుంది.


ఈ రెండు పదార్థాలతో నూనెను తయారు చేసుకుని వాడడం వల్ల మనం ఖచ్చితంగా చాలా సులభంగా జుట్టు ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుచుకోవచ్చు. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో 8 టీ స్పూన్ల కొబ్బరి నూనెను మీరు తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో 2 టీ స్పూన్ల కాళోంజి విత్తనాలను వేసి బాగా కలపాలి. ఈ నూనెను డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ లో మీరు వేడి చేయాలి. అలాగే ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఆ నీళ్లు వేడయ్యాక ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి నూనె గిన్నెను నీటిలో ఉంచి నెమ్మదిగా కలుపుతూ నూనెను మీరు వేడి చేయాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు నూనెను వేడి చేసిన తరువాత దీనిని బయటకు తీసి బాగా చల్లారనివ్వాలి. ఆ తరువాత ఈ నూనెను వడకట్టి స్టోర్ చేసుకోవాలి. తరువాత ఇలా తయారు చేసుకున్న నూనెను జుట్టు కుదుళ్లకు పట్టేలా బాగా పట్టించాలి. ఇలా రాత్రి పడుకునే ముందు జుట్టుకు పట్టించి పొద్దున్నే తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు రాలడం ఈజీగా తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా, నల్లగా ఇంకా పొడవుగా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: