వంట గ్యాస్ ధరలు రోజుకో విధంగా మారుతున్నాయి. అసలే కరోనా వల్ల దెబ్బ తిన్న ప్రజలకు ఇప్పుడు వంట గ్యాస్ బాదుడు నానాటికీ పెరిగిపోతోంది. మొన్నటి దాకా కాస్త భారంగా కూర్చున్న ధర నేటి నుంచి గుండె పోటును తెప్పించాయి. ఈ రోజు నుంచి ధరలు భారీగా పెరిగాయి. మళ్లీ పైకి కదిలాయి. ఈ విషయం సామాన్యుడికి మింగుడు పడకపోయినా కూడా తినాలంటే వంట గ్యాస్ కొనక తప్పదు.. మొన్నటివరకు పెరిగిన ధరలు ఇప్పుడు వంట గ్యాస్ వినియోగ దారులకు మరోసారి షాక్ తగిలింది. ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు గురువారం మరోసారి గ్యాస్ ధర పెంచాయి.


ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.25 పెరిగింది. ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.794కు చేరింది. బుధవారం వరకు దేశ రాజధానిలో రూ.769కే గ్యాస్ సిలిండర్‌ను సరఫరా చేశారు..ఫిబ్రవరి నెలలో గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఫిబ్రవరి 4న గ్యాస్ సిలిండర్ ధర రూ.25 పెరగ్గా.. 15వ తేదీన రూ.50 పెరిగింది. ఇప్పటి వరకూ మూడు వారాల వ్యవధిలోనే సిలిండర్ ధర రూ.100 పెరగడం సామాన్యుడికి పెను భారంగా మారింది.



ఇకపోతే హైదరాబాద్ లో సిలిండర్ ధర రూ.846.50 పైసలకు చేరింది. ముంబైలో రూ.794, చెన్నైలో రూ.810, కోల్‌కతాలో రూ.820కి గ్యాస్ సిలిండర్ ధర చేరుకుంది.తాజా పెరుగుదలతో.. గత మూడు నెలల్లోనే వంట గ్యాస్ ధర రూ.200 పెరిగినట్లయ్యింది. డిసెంబర్ నెలలో గ్యాస్ సిలిండర్ ధర రూ.100 పెరగ్గా.. జనవరిలో ధర మారలేదు. నవంబర్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.రూ.594 మాత్రమే ఉండటం గమనార్హం... గత మూడు నెలల్లో దాదాపు 300 లకు పైగా పెరిగింది.. ఏది ఏమైనా మరో వైపు కరోనా సెకండ్ వేవ్ మళ్లీ పెరుగుతుంది. ఈ మేరకు మళ్లీ ఆర్ధిక పరిస్థితులు దెబ్బ తినే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: