ఇటీవలే జరిగిన దుబ్బాక ఎన్నిక ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో అందరికి తెలిసిందే.. తెరాస పార్టీ కి వన్ సైడ్ అవుతుందనుకున్నారు అంతా కానీ బీజేపీ ఎంట్రీ తో ఈ రెండు పార్టీ లమధ్య పోరు ఎంతో ఆసక్తి కరంగా మారిపోయింది. బీజేపీ గెలుపుతో తెరాస వాయిస్ అక్కడ మూయగబోయింది.. ఇక గ్రేటర్ ప్రచరంలోనూ బీజేపీ తన జోరు ను చూపించింది.. తెరాస కి షాక్ ఇచ్చేలా ప్రచారం అయితే చేసింది..  ఈ రెండు పార్టీ లు గ్రేటర్ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోగా హోరాహోరీగా ప్రచారాల్లో పోటీపడ్డాయి. ఇక కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో తన శక్తి కి మేర ప్రయత్నించిందని చెప్పొచ్చు..