పబ్‌జీ గేమ్.. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న డేంజర్‌ వీడియో గేమ్ ఇది. యువ‌త ఈ గేమ్ ఆడేందుకు అల‌వాటు ప‌డి త‌మ చుట్టూ ఏం జ‌రుగుతోంద‌న్న విష‌యం కూడా మ‌ర్చిపోతున్నారు. ఈ గేమ్ ప్ర‌స్తుతం యువ‌త మానసిక ప‌రిస్థితుల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. అయితే ఈ డేంజ‌ర్ గేమ్ ఇప్పుడు విశాఖ గ్యాస్ ప్ర‌మాదంలో వేలాది మంది ప్రాణాల‌ను కాపాడింది. గ్యాస్‌ లీక్‌ అయిన సమయంలో పబ్‌జీ ఆడుతున్న కిరణ్.. ఊళ్లో అందరి కంటే ముందుగా కెమికల్‌ వాసనను గుర్తించాడు. 

 

ఏదో ప్ర‌మాదం జ‌రుగుతుందోన్న ఆందోళ‌న‌తో త‌న స్నేహితులు అంద‌రికి ఫోన్లు చేశాడు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన కిర‌ణ్ ఫ్రెండ్స్ కంపెనీకి ఫోన్ చేయ‌గా వాళ్లు స్టెరీన్ లీక్ అయ్యింద‌ని చెప్పారు. దీంతో వెంట‌నే ఒక‌రికి ఒక‌రు ఫోన్లు చేసుకుని అలా త‌మ చుట్టు ప‌క్క‌ల వారంద‌రు అలెర్ట్ అయ్యేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు. ఈ వార్త దాన‌వాలంలా వ్యాపించ‌డంతో వెంటనే వెంకటాపురం గ్రామస్తులు ఊరిని ఖాళీ చేశారు. ముప్పు పొంచి ఉందన్న వార్తతో కనీసం తాళాలు వేయాలన్న ఆలోచన కూడా ఎవరికీ రాలేదు. 

 

మ‌రి కొంద‌రు అర్ధ‌రాత్రి ఎటు ప‌రిగెత్తాలో తెలియ‌క పొలం గ‌ట్ల వెంట ఏకంగా ఐదు కిలోమీట‌ర్ల పాటు పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు. ఏదేమైనా కిర‌ణ్ అలెర్ట్ చేయ‌డంతో త‌మ గ్రామ‌స్తుల్లో చాలా మంది సేఫ్ అయ్యామ‌ని వారు చెపుతున్నారు. లేక‌పోతే మ‌రింత ప్రాణ‌న‌ష్టం జ‌రిగి ఉండేద‌ని స్థానికులు చెపుతున్నారు. తమ గ్రామాన్నంతా కాపాడగలిగిన కిరణ్, విషవాయువుని ఎక్కువగా పీల్చటంతో అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం కేజీహెచ్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. తమను కాపాడిన యువకులకు ధన్యవాదాలు చెబుతున్నారు వెంకటాపురం గ్రామస్తులు.

మరింత సమాచారం తెలుసుకోండి: