నేడు క్యాంపు కార్యాలయంలో జిల్లాల వారీగా ఇళ్లపట్టాలపై పరిస్థితిని ఆయన మంగళవారం సవిూక్షించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. భూసేకరణ, పొజిషన్‌, ప్లాట్ల అభివృద్ధి విూద నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను సూచించారు. నూటికి నూరు శాతం ఇళ్లపట్టాలు పంపిణీ కావాలని, కచ్చితంగా ఇళ్లపట్టాలు పంపిణీ కావాలన్న విషయాన్ని పదేపదే గుర్తుంచుకోవాలని సిఎం పదేపదే సూచించారు.  ఇక వర్షాకాలంలో పనుల కోసం ఇసుక కొరత రాకుండా నిల్వ చేయాలని సిఎం వైఎఎస్జగన్‌ అధికారులను ఆదేశించారు.

 

నిర్దేశించుకున్న 70 లక్షల టన్నుల ఇసుకను వర్షాకాలంలో పనుల కోసం నిల్వచేయాలని సీఎం సూచించారు. వచ్చే రెండు వారాల్లో మాత్రమే ఇసుక మనకు అందుబాటులో ఉంటుంది. అధికారులతో క్యాంపు కార్యాలయంలో ఇసుక  నిల్వలపై సవిూక్షించారు. ఇప్పటికే 46.30 లక్షల మెట్రిక టన్నులు నిల్వచేశామని అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. 

 

వర్షాలకాలంలో రీచ్‌లు మునిగే అవకాశాలు ఉంటాయి. కావాల్సిన ఇసుకను ఇప్పటికే నిల్వచేసుకోవాలని అన్నారు.  శ్రీకాకుళం 20 వేలు, తూర్పుగోదావరి 60 వేలు, పశ్చిమగోదావరి 35 వేల టన్నులు, కృష్ణా 50 వేల టన్నులు, గుంటూరు 40 వేల టన్నులు ప్రతి రోజూ ఇసుకను ఉత్పత్తి చేయాలని సీఎం పేర్కొన్నారు. రోజువారీ అవసరాలను తీరుస్తూనే.. వర్షాకాలంలో అవసరాల కోసం ఈ ఇసుకను నిల్వ చేశామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: