దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ తరుణంలో వ్యాక్సినేషన్, ఆక్సిజన్ కొరత, పలు చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పలువురు ముఖ్యమంత్రులతో మాట్లాడారు. కరోనా మహమ్మారి పరిస్థితిపై చర్చించారు. ఈ చర్చలపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.
ఈ రోజు గౌరవనీయ ప్రధాని ఫోన్ చేశారు. ఆయన తన మన్ కీ బాత్ (మనసులోని మాట) చెప్పారు. కానీ ఆయన వ్యవహారంపై మాట్లాడి.. మేం చెప్పేదేమిటో వింటే బాగుండేది అని సోరేన్ కామెంట్ చేశారు. తన ఆందోళన ఏమిటో చెప్పేందుకు ప్రధాని అనుమతించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని తాను మాత్రమే మాట్లాడారని, ఎదుటి వ్యక్తిని మాట్లాడనివ్వలేదని అంటూ సోరెన్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. అయితే.. హేమంత్ సొరేన్ ట్వీట్ కు బదులిచ్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. విభేదాలు ఉన్నా ఇలాంటి రాజకీయ విమర్శలు మన జాతీయత ను బలహీనపరుస్తాయంటూ ఆయన ట్విట్ చేశారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: