దేశంలో కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. ప్రతి రోజు కూడా లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలల్లో కూడా కేసుల సంఖ్య భారీగానే నమోదు అవుతుంది. సామాన్య ప్రజలతో పాటు ఎంతో మంది ప్రముఖులు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ట్విట్టర్ లో ఆయన స్పందిస్తూ " నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది.. ప్రస్తుతం కుటుంబానికి దూరంగా వైద్యుల పర్యవేక్షణలో కోవిడ్ ప్రోటోకాల్ అనుసరిస్తున్నాను. ఎవరు చింతించకండి.. గత కొన్ని రోజులుగా నాతో కలిసిన వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోండి.. ఇంట్లోనే ఉండండి.. సురక్షితంగా ఉండండి " అంటూ తారక్ ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: