తెలంగాణ మంత్రి హరీష్ రావు ఈరోజు పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. అయితే కరోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో తాను ఈ సంవ‌త్స‌రం పుట్టిన రోజు వేడుక‌ల‌కు దూరంగా ఉంటున్న‌ట్టు హ‌రీష్ రావు నిన్న సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. త‌న‌ను క‌లిసేందుకు ఎవ‌రూ రాకూడ‌ద‌ని పేర్కొన్నారు. ఇక పుట్టిన రోజు వేడక‌ల‌కు దూరంగా ఆయ‌న‌కు ప‌లువురు మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేలు సోష‌ల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఎమ్మెల్సీ క‌విత కూడా సోషల్ మీడియాలో  హ‌రీష్ రావుకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. బావా హ్యాపీ బర్త్ డే అంటూ కవిత త‌న‌ పోస్ట్ లో పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ సందర్భంగా పోస్ట్ చేసిన ఫొటోలో కవిత మరియు హరీష్ రావు ఉన్నారు. కాగా ఫొటోకు పలువురు హరీష్ రావు అభిమానులు ఫ్యూచర్ సీఎం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: