తెలంగాణలో కరోనా  విజృంభణ  నేపథ్యంలో విద్యా సంస్థలన్నీ మూత పడిన సంగతి తెలిసిందే. దాంతో గత ఏడాదిన్నర కాలంగా ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. మధ్యలో లో కొన్ని రోజులు పై తరగతులకు క్లాసులు నిర్వహించినప్పటికీ మళ్లీ కరోనా కేసులు పెరగటం తో విద్యాసంస్థలు మూతపడ్డాయి.  అయితే తాజాగా ఈరోజు కేబినెట్ తో సమావేశమైన  ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జులై 1 నుండి రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీలు అన్ని విద్యాసంస్థలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.

అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పిల్లల తల్లితండ్రులు స్కూల్స్ కు పంపిస్తారా లేదా అన్నది చూడాలి. మరో వైపు థర్డ్ వేవ్ హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారాన్నది కూడా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా లాక్ డౌన్ ను సైతం పూర్తిగా ఎత్తి వేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: