
పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద టిపిసిసి కొత్త చీఫ్ రేవంత్ రెడ్డి మళ్ళీ ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఏ ఒక్కరూ మంత్రివర్గంలో లేరని విమర్శించిన ఆయన పార్టీ మారిన ఎమ్మెల్యేలు రద్దయిన వెయ్యి రూపాయల నోట్లు వంటివారు అని పేర్కొన్నారు.. చీము నెత్తురు ఉంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని ఆయన సవాల్ విసిరారు.
ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని పేర్కొన్న ఆయన గ్రామాల్లోకి వస్తే మా కార్యకర్తలు ఉరికించి కొడతారు అని అన్నారు. ఇన్నాళ్లు మా పార్టీ నేతలు మర్యాదగా ఉన్నారని, ఇక మీదట ఆ మర్యాద కూడా దక్కదని ఆయన హెచ్చరించారు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలని కొట్టి చంపాలని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన రెండు మూడు రోజుల నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. మళ్లీ అదే వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.