హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌ బూమ్‌ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. తాజాగా హెచ్ఎండీఏ చేపట్టిన  ఈ- వేలం ప్రక్రియకు విపరీతమైన ఆదరణ వచ్చింది. ఈ వేలలంలో తొలి రోజు 85 ప్లాట్‌లకు గాను 73 ప్లాట్‌లు అమ్ముడుపోయాయి. మొత్తం 85 ప్లాట్‌లకు గాను 73 ప్లాట్‌లను బిడ్డర్లు కొనుగోలు చేశారు. బహదూర్‌పల్లి వెంచర్‌లో 51 ప్లాట్‌లు వేలానికి పెడితే ఒకటి తప్ప అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ బహదూర్‌పల్లి వెంచర్‌లో అత్యధికంగా గజం ధర రూ.42,500 పలికింది. బహదూర్‌పల్లి వెంచర్‌లో అత్యల్పంగా గజం ధర రూ.29 వేలు పలికింది.


అలాగే తుర్కయంజాల్ వెంచర్‌లో 34 ప్లాట్‌లు వేలానికి పెడితే 23 ప్లాట్‌లు అమ్ముడుపోయాయి. ఇక్కడ అత్యధికంగా గజం ధర రూ.62,500 పలకడం విశేషం. తుర్కయంజాల్‌ వెంచర్‌లో అత్యల్పంగా గజం ధర రూ.40,500 పలికింది. మొత్తం ఈ- వేలం ద్వారా రూ.137.65 కోట్ల విలువచేసే ప్లాట్‌లను హెచ్‌ఎండీఏ అమ్మింది.


మరింత సమాచారం తెలుసుకోండి: