ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా ఇంటి ముంగిటకే వైద్య సేవలు అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులోనే తెలిపింది.  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈ విషయాన్ని రాతపూర్వకంగా వెల్లడించారు. రాజ్యసభలో వైయ‌స్ఆర్ సీపీ  సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ రాతపూర్వకంగా జవాబిచ్చారు.


డాక్టర్ వైయ‌స్ఆర్‌ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద నెలకొల్పిన 6-7 వెల్‌నెస్‌ సెంటర్లకు కలిపి  ఇద్దరేసి వైద్యాధికారులు అందుబాటులో ఉంటారని మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. ఒక్కో వైధ్యాధికారి నెలలో రెండు పర్యాయాలు ఈ వెల్‌నెస్‌ సెంటర్లను సందర్శించి గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. మరి నిజంగా ఏపీలో సర్కారీ వైద్యం ఇంత బావుందా.. ఉంటే అద్భుతమే.

మరింత సమాచారం తెలుసుకోండి: