పాపం.. మాజీ సీఎం జైల్లో చాలా కష్టాలు పడుతున్నారట. ఆయన జైల్లో పడుతున్న కష్టాలపై ఓ తెలుగు ప్రముఖ దినపత్రిక ఆసక్తికరమైన వార్త ఇచ్చింది. చంద్రబాబుకు స్నానానికి వేడి నీళ్లు కూడా ఇవ్వట్లేదట. చన్నీళ్లతోనే ఆయన స్నానం చేస్తున్నారట. అంతే కాదు.. ఆయన బ్యారక్ చెట్టూ చెట్లు ఉన్నాయట. అందువల్ల దోమలు విపరీతంగా కుడుతున్నాయట. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి.. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు కారాగారంలో కనీస సదుపాయాలు కూడా కల్పించరా అని ఆ పత్రిక వాపోయింది. చంద్రబాబుకు రూల్స్ ప్రకారం కేటగిరీ 1 కింద ప్రత్యేక సదుపాయాలు కల్పించాలట. కానీ అవేవీ ఇవ్వట్లేదట.. 74 ఏళ్ల వయసులో, వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో చంద్రబాబు బాధపడుతున్నారు.

కారాగారంలో 60 ఏళ్లు దాటిన ఖైదీలకు స్నానానికి విధిగా వేడినీళ్లు సమకూర్చాలనే నిబంధన కూడా ఉందట. కానీ చంద్రబాబుకు మాత్రం స్నానానికి చన్నీళ్లే ఇస్తున్నారట. చంద్రబాబుకు కేటాయించిన చోట కేటగిరీ1 స్థాయిలో వసతులు కనిపించ లేదట. గది శుభ్రత, కేటాయించిన మంచం, కుర్చీలు కూడా అనువుగా లేవట. ఒక ఫ్యాన్‌, బెడ్‌ మాత్రమే ఇచ్చారట.


మరింత సమాచారం తెలుసుకోండి: