హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో గురువారం ముఖ్యమంత్రిగా ఎ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఉత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి, మంత్రి మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ శాంతి కుమారి సమావేశం నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎస్ శాంతి కుమారి కోరారు.


ప్రమాణస్వీకారానికి వచ్చే వారికి తగిన బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. అగ్నిమాపక యంత్రాలు, అగ్నిమాపక శకటాలను వేదిక వద్ద ఉంచాలని.. వేదికను శుభ్రపరచడం, త్రాగు నీరు ఫాగింగ్ చేయడం వంటివి చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను సీఎస్ శాంతి కుమారి కోరారు.  L.B.స్టేడియం వద్దకు వెళ్లే రహదారుల మరమ్మతులు చేపట్టాలని సీఎస్ శాంతి కుమారి సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: