కంపెనీ ట్విట్టర్ వేదికగా ఆఫర్ వివరాలను వెల్లడించింది. సాధరాణ బైక్ నుంచి స్పోర్ట్స్ మోటార్‌సైకిల్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలని భావించే వారికి ఇది మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. మీరు నచ్చిన బైక్ కొనుగోలు చేయాలని భావిస్తే.. దగ్గరిలోని కవాసకి షోరూమ్‌కు వెళ్లి ఆఫర్ వివరాలు తెలుసుకోవచ్చు.. ఇకపోతే ఈ బైక్ ల పై తగ్గింపు ఈ నెల 30 వ తేదీ వరకు ఉంటుంది.
వల్కన్ ఎస్ మోడల్ పై రూ.20 వేలు, వెర్సీస్ 650 బైక్ పై రూ.30 వేలు, నింజా 1000ఎస్‌ఎక్స్ బైక్ పై రూ.30 వేలు, డబ్ల్యూ800 మోడల్‌పై రూ.30 వేల తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా ఇతర బైక్స్‌పై ఆఫర్లు ఉన్నాయి.ఆఫ్‌లోడ్ బైక్స్‌పై కూడా డిస్కౌంట్ పొందొచ్చు. కేఎల్‌ఎక్స్110 మోడల్ పై రూ.30 వేల తగ్గింపు ఉంది. కేఎల్‌ఎక్స్140 మోడల్ పై రూ.40 వేల డిస్కౌంట్ పొందొచ్చు. ఇంకా కేఎక్స్100 మోడల్‌పై రూ.50 వేల తగ్గింపు ఉంది. ఈ ఆఫర్లు స్టాక్ ఉన్నంత వరకే అందుబాటు లో ఉంటాయి.. చూసారుగా ఎలా కొనుగోలు చేయాలో.. అసలు ఆలస్యం చేయకుండా బైక్ కొనాలనుకునే వాళ్ళు ఈ ఆఫర్ ను ఉపయోగించుకోండి.. మరీ మరీ చెప్తున్నాం ఈ ఆఫర్ కేవలం ఏప్రిల్ 30 వరకే మాత్రమే అందుబాటులో ఉంటుంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి