సెమీ కండక్టర్... ప్రపంచ టెక్నాలజీ వ్యవస్థను శాసించిన ఓ చిన్న చిప్. అందరూ రోజూ వినియోగించే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్లు, కార్లు... ఇతర హోమ్ అప్లయెన్సెస్‌ తయారీలో సెమీ కండక్టర్ తప్పని సరి. అయితే ఈ చిన్న చిప్ ఇప్పుడు మానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌ను  ఓ కుదుపు కుదిపేసింది. ఆటోమొబైల్ రంగాన్ని సెమీ కండక్టర్ చిప షార్టేజ్ కుదేలు చేసింది. ఇక స్మార్ట్ ఫోన్ల తయారీ పైన కూడా చిప్ షార్టేజ్ పెను ప్రభావం చూపింది. చిప్ కొరత కారణంగా ఎలక్ట్రానిక్ రంగం తీవ్రంగా నష్టపోయింది. సెమీ కండక్టర్ చిప్ కొరత ప్రపంచాన్ని ఇప్పటికీ పీడిస్తోంది. అతి తక్కువ ధరలో అందుబాటులోకి రావాల్సిన జియో స్మార్ట్ నెక్ట్స్ ఫోన్ కూడా ఇప్పటికీ విడుదల కాలేదు. ఇందుకు ప్రధాన కారణం కూడా సెమీ కండక్టర్ కోరతే. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో టెక్నాలజీ కీ రోల్ పోషిస్తోంది. ఇంజిన్ కంట్రోల్, ట్రాన్స్ మిషన్ కంట్రోల్, డిస్ ప్లే, ఓడో మీటర్ యూనిట్లు పనిచేయాలంటే సెమీ కండక్టర్ చిప్ తప్పని సరి.

ప్రస్తుతం ఆటో గేర్, ఎలక్ట్రానిక్ వాహనాల తయారీపైనే ఆటోమొబైల్ సంస్థలు ఎక్కువగా దృష్టి పెట్టాయి. కొత్తగా తయారయ్యే కార్లల్లో వైపర్లు పని చేయాలన్నా కూడా చిప్ అవసరమే. కార్ల తయారీలో ఎలక్ట్రానిక్ సర్క్యూట్ల వినియోగం పూర్తిగా చిప్‌లతోనే ముడి పడి ఉంది. దీంతో చిప్‌లకు ప్రస్తుతం డిమాండ్ భారీగా పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా చిప్ తయారీ సంస్థలు ప్రస్తుతం హాంకాంగ్, చైనాలో మాత్రమే ఉన్నాయి. అయితే కరోనా కారణంగా చిప్‌ల తయారీకి బ్రేక్ పడింది. ఇండియాలో చిప్ తయారీ యూనిట్లు పెద్దగా లేవు. దాదాపు పెద్ద సంస్థలన్నీ కూడా వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి. ఇందుకోసం పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యం కూడా ఖర్చు చేస్తున్నాయి. ప్రతి ఏటా దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల విలువైన చిప్‌లను భారత్ దిగుమతి చేసుకుంటోంది. వీటి కొరతను అధిగమించేందుకు ఇప్పుటు టాటా సన్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆటోమొబైల్ రంగంలో టాప్ ప్లేస్‌లో ఉన్న టాటా గ్రూప్... ఏకంగా 300 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయ్యింది. ఈ ప్లాంట్ కోసం ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: