
వివరాల్లోకి వెళితే.. జిల్లాలో ఉండే అర్చన శర్మ ఆమె భర్తతో కలిసి ఓ ప్రైవేట్ ఆస్పత్రి నడుపుతున్నారు. కాగా డాక్టర్ అర్చన సిజేరియన్ గా చేస్తూ ఉంది. అయితే ఇటీవల సీరియల్ చేస్తున్న సమయంలో ఓ గర్భిణి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గర్భిణి మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు బంధువులు అందరూ కూడా ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఆమెకేసు నమోదైంది. ఇక ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందిన వైద్యురాలు ఆసుపత్రిపై ఉన్న తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఇలా ఆత్మహత్యకు ముందు తన బలవన్మరణానికి కారణం ఏంటి అన్న విషయాన్ని సూసైడ్ నోట్లో రాసింది అర్చన. ఈ క్రమంలోనే ఈ ఘటన సంచలనం గా మారిపోయింది. కేసులో ఉన్న సున్నితత్వాన్ని పరిగణలోకి తీసుకొని ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. నిందితులను విడిచిపెట్టబోము అంటూ స్పష్టం చేశారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడటానికి వైద్యులు సాయశక్తులా ప్రయత్నిస్తారు.. కానీ ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు వైద్యులను నిందించడం సమంజసం కాదు అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు ఆయన..