
ఈ విషయం ఆ అమ్మాయికి చెప్పాడు. కానీ, తనను కలవడానికి ఆ అమ్మాయి ఒప్పుకోలేదు.. తల్లిదండ్రులకు తెలిస్తే గొడవైపోద్దని చెప్పింది. ఆమెపై పెంచుకున్న ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న యువకుడు అదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. ఆమె కూడా ఓకే చెప్పి.. పెళ్లి గురించి మాట్లాడటానికి తన పినతల్లిని పంపుతున్నట్టు అతనికి తెలిపింది. అనుకున్నట్టుగానే ఆమె పినతల్లి అతని ఇంటికి వచ్చింది. అబ్బాయి కుటుంబ సభ్యులతో మాట్లాడి పెళ్లి ఖాయం అనుకున్నారు. ఈ క్రమంలో ఇంట్లో వారికి తెలియకుండా యువకుడు పెళ్లి ఖర్చుల కోసమని ఆమె చేతిలో మూడున్నర లక్షలు పెట్టాడు. ఓ మఠంలో మ్యారేజికి ఏర్పాట్లు జరిగాయి.
పెళ్లికి వచ్చిన యువతి 'పినతల్లి'.. పెళ్లి కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పడంతో అందరూ షాక్ తిన్నారు. అయితే, ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఆమె చెప్పింది విని పోలీసులే కంగుతిన్నారు. అలా యువకుడికి పరిచయమైన ఆ యువతి ఈ 'పిన్నమ్మే'నని తెలిసి అవాక్కయారు. వారే కాదు.. విషయం తెలిసిన యువకుడికి మూర్చ వచ్చినంత పనైంది. తన ఫొటోకు బదులుగా మరో యువతి ఫొటోను పెట్టి యువకుడిని బోల్తా కొట్టించినట్టు అంగీకరించింది. అతడి నుంచి తీసుకున్న డబ్బును వెనక్కి ఇచ్చేందుకు ఆమె అంగీకరించడంతో రాజీ కుదిరింది..ఇలాంటి వాటి గురించి జాగ్రత్తగా వుండాలని పోలీసులు హితవు పలికారు.