ప్రేమ అనేది ఒక మధురమైన అనుభూతి అన్న విషయం తెలిసిందే. ఒకరి ఇష్టాలను  మరొకరు గౌరవిస్తూ ఒకరి భావాలను మరొకరు చూసుకుంటూ.. ఒకరిని ఒకరు అమితంగా ప్రేమించుకుంటూ ఉంటే ఇక జీవితంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు మిగిలిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ప్రేమ అంటే ఇంత స్వీట్ గా ఉంటుందని మాత్రమే అనుకుంటారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ప్రేమ అనేది రక్తపాతానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే మధురమైన ప్రేమ కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఏర్పడింది.


 ప్రేమలో మోసపోయి కొంతమంది మనస్థాపంతో ప్రాణాలు తీసుకుంటుంటే.. కొంతమంది ప్రేమించిన వారి ప్రాణాలను తీసేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ప్రేమోన్మాదులు రెచ్చిపోతూ దారుణహత్యకు పాల్పడుతూ ఉన్నారు అని చెప్పాలి. వెరసి ఇలాంటి ఘటనలు సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. దక్షిణ ఢిల్లీ లోని సంగం విహార్ ఏరియాలో స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలికపై గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు.


 ఈ ఘటన తో స్థానికంగా సంచలనంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. ఇకపోతే ఎందుకు కాల్పులు జరిపారు అన్న ప్రశ్నకు నిందితులు చెప్పిన సమాధానంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. నిందితుల్లో ఒకరితో బాలిక వాట్సాప్ లో చాటింగ్ చేసేది.  కానీ ఆ తర్వాత ఆమె చాటింగ్ చేయడం మానేసింది. అంతే కక్ష పెంచుకుని కాల్పులు జరిగినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. బాలిక ఆర్మాన్ అలీ అనే వ్యక్తి తో చాటింగ్ చేయగా.. చాటింగ్ ఆపేయడంతో బబ్బి, పవన్ తో కలిసి కాల్పులు జరిపారు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన బాలిక కోలుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: