ఇటీవల కాలంలో మనుషులు ఆలోచన తీరు పూర్తిగా మారిపోయింది అని చెప్పాలి. సాధారణంగా ఒకప్పుడు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి సభ్య సమాజంలో గౌరవాన్ని సంపాదించుకోవాలని అందరూ ఆలోచించేవారు. లేదంటే ఏదో ఒక వ్యాపారం చేసి ఇక వృద్ధుల్లోకి రావాలని ఆశపడేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఇలా ఉద్యోగం వ్యాపారం అంటే అంతా రిస్క్ తో కూడుకున్న పని.. ఇవి కాకుండా సులభంగా డబ్బు సంపాదించాలి అని ఆశపడుతున్నారు. ఈ క్రమంలోనే సాటి మనుషులను ఎప్పుడు మోసం చేయాలా అని సమయం సందర్భం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 మంచి వాళ్లలా ముసుగు వేసుకొని మాయమాటలతో నమ్మించి చివరికి మోసాలకు పాల్పడుతున్న ఘటనలు నేటి రోజుల్లో కోకోల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. కాగా ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మోసానికి పాల్పడటం అనేది మనిషి అతని నైజంగా భావిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది అని చెప్పాలి. సాధారణంగా ఎవరికైనా అవసరమైన సమయంలో కార్లను అద్దెకు తీసుకొని వినియోగించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.


 ఇలా ఇటీవల కాలంలో కార్లను అద్దెకు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఇక ఇతను కూడా అందరి లాగే కార్లను రెంటుకు తీసుకుంటూ ఉంటాడు. కానీ అందరిలాగా అవసరాలకు వినియోగించుకోవడం కాదు ఏకంగా వాటిని తాకట్టు పెట్టి లక్షలు సంపాదిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతనిపై కొన్ని రోజుల నుంచి ప్రత్యేకంగా నిఘా పెట్టిన పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. హైదరాబాద్ దబీర్ పురాలో నిందితుడు నాలుగు కార్లను  అధిక తీసుకొని ఏడు లక్షలకు తాకట్టు పెట్టి పారిపోయినట్లు గుర్తించారు పోలీసులు. కార్ల యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇక ప్రత్యేక నిఘా పెట్టి నిందితున్ని అదుపులోకి తీసుకొని అతని దగ్గర నుంచి 26 లక్షల విలువ చేసే నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: