ఒక చిన్న స్థాయి అధికారి అయినా తమ పనులు తాము చేసుకోవడానికే ఇతరులపై ఆధారపడుతుంటారు. ఒక్కసారి కారు ఎక్కారంటే కారు దిగే ముచ్చటే ఉండదు . కానీ ఓ
జిల్లా కలెక్టర్ ఏకంగా తన కారు టైర్ ను మార్చుకుంది. ఎవరి సహాయం లేకుండానే
జాకీ పెట్టి కారు టైర్ ను అమర్చారు. ఆ
కలెక్టర్ కూడా మన తెలుగు వారై ఉండటం గర్వకారణం. పూర్తి వివరాల్లోకి వెళితే... తెలుగింటి ఆడపడుచు మైసూరు
జిల్లా కలెక్టర్ రోహిణి సిందూరి తన కుటుంబ సభ్యులతో కలిసి కొడుగు పర్యాటక ప్రాంతానికి విహార యాత్రకు వెళ్లారు. ఆ సమయంలో
రోహిణి సొంతంగా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు . అయితే మార్గ మధ్యలోనే
కార్ టైర్ పంక్చర్ అయ్యింది. దాంతో తనే స్వయంగా కారు దిగి
జాకీ అమర్చారు..జాకీ అమర్చి టైర్ తీసి కొత్త టైర్ ను అమర్చారు . అదే దారిలో వెళుతున్న కొంతమంది గమనించి కారు ఆపారు. మీరు
కలెక్టర్ రోహిణి కదా అనడంతో ఆమె అవునని సమాధానం ఇచ్చారు.
దాంతో వాళ్ళు టైర్ అమర్చడం గమనించి వీడియోలు, ఫోటోలు తీశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .
కలెక్టర్ హోదాలో ఉండి కారు టైర్ అమర్చడం పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు
కలెక్టర్ కావడం..ఆమెకు ప్రశంసలు రావడంతో తెలుగు వాళ్ళు
ఖుషి అవుతున్నారు . గాంధీజి చెప్పిన ఎవరి పని వాళ్ళు చేసుకోవాలనే మాటను..ఈ
కలెక్టర్ ప్రాక్టికల్ గా రుజువు చేసిందంటున్నారు.
జిల్లా కలెక్టర్ హోదాలో ఉన్న అధికారిని
ఫోన్ కొడితే నిమిషాల్లో పనైపోతుంది. .ఫోన్ కొడితే అధికారులు. .పోలీసులు పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ
కలెక్టర్ రోహిణి అలా చేయలేదు. అలా చేయలేదు కాబట్టే ఇప్పుడు ప్రశంసలు అందుకుంటుంది .