రోజురోజుకు ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గడం లేదు అని చెప్పాలి. మహిళలకు రక్షణ కల్పించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా చట్టాలలోని లొసుగుల ను ఉపయోగించుకుని నేరస్తులు యదేచ్ఛగా నేరాలకు పాల్పడుతున్నారు. ఇక ఆడ పిల్లల పై అత్యాచారం చేస్తే కఠిన శిక్షలు పడతాయన్న భయం మాత్రం ఎవరి లో కనిపించడం లేదు నేటి రోజుల్లో. వెరసి రోజురోజుకు ఎక్కడికక్కడ అత్యాచారాలు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గడం లేదు. బయట ఉండే పరాయి వాళ్ల నుంచి మాత్రమే కాదు ఏకంగా సొంత వారి నుంచి కూడా లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. దీంతో ఆడపిల్ల దిక్కుతోచని స్థితిలో పడిపోవాల్సిందే పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాదు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కొంతమంది మంచి వాళ్ళ ముసుగులో పరిచయం పెంచుకుని ఇక ఆ తర్వాత దారుణంగా అత్యాచారాలు చేస్తున్న వారు ఎక్కువై పోతున్నారు నేటి రోజుల్లో. ఇక్కడ ఇలాంటి తరహా దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని ఘనపూర్ మండలం అప్పన్నపల్లి గ్రామంలో ఓ మైనర్ బాలికపై యువకుడు దారుణంగా అత్యాచార యత్నం చేశాడు. అయితే గమనించిన స్థానికులు ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు. రమేష్ అనే వ్యక్తి  విద్యుత్ మీటర్ రీడింగ్ తీసుకోవడానికి అప్పాజీ పల్లి గ్రామానికి వచ్చాడు. ఇక  విద్యుత్ మీటర్ రీడింగ్ తీసుకుంటున్న సమయంలో ఇంట్లో బాలిక ఒంటరిగా కనిపించింది. దీంతో ఇక రమేష్ లోని కామాందుడు బయటికి వచ్చాడు. ఇక ఇంట్లో ఎవరూ లేక పోవడమే అదునుగా భావించిన రమేష్ ఏకంగా మైనర్ బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే బాలిక గట్టిగా కేకలు వేయడంతో పక్క ఇంట్లో ఉన్న సోదరులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే రమేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే విషయం తెలుసుకున్న గ్రామస్తులు అతని మధ్యవర్తి ద్వారా పిలిపించి దేహశుద్ధి చేశారు.. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: