తెలంగాణా లో రోడ్డు ప్రమాధాలు రోజు రోజుకు ఎక్కువ అవుతూన్నాయి. రాత్రిళ్ళు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కొన్ని ప్రమాదాలు జరిగితే, అతి వేగం కారణంగా కొన్ని రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు, ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారూ.. ఇక పోతే ద్విచక్ర వాహానాల పై పోయే వాళ్ళు సరైన ట్రాఫిక్ రూల్స్ అనుసరించక, హెల్మెట్ ను వాడక ఇలా ఒక్కొలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అందరికి తెలుసు.


హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల కు వెళ్ళే వారు అతి వేగంగా వాహానాన్ని నడపడం వల్ల ప్రాణాలు ను పోగొట్టుకున్నారు.. కరోనా నుంచి ప్రాణాలు ను పోగొట్టుకునే వారి కన్నా, ఇలా ప్రమాదాలు ద్వారా చాలా మంది ప్రాణాలు ను కొల్పొతున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన కారు రోడ్డు పక్కన ఉన్న ఇళ్ళల్లోకి దూసుకెల్లింది. 

ఈ రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలొ అందరూ గాఢ నిద్రలో వున్నారు. దానితో ఈ ఘోరాన్ని పసిగట్ట లేక పోయారు.




వివరాల్లొకి వెళితే.. కరీంనగర్ జిల్లా లో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటన లో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. కరీంనగర్ కమాన్ వద్ద కారు బీభత్సం సృష్టించిందని స్థానికులు తెలిపారు. వేగంగా వచ్చి అదుపు తప్పిన కారు రహదారి పక్కన ఉన్న గుడిసెల్లో కి దూసుకెళ్లింది. దీంతో గుడిసెల్లో నిద్రిస్తున్న నలుగురు మహిళలు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షత గాత్రుల ను కరీంనగర్ ప్రభుత్వా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.. ఈ ఘటన పై పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: