ఇటీవల కాలంలో మనుషు ఆలోచన తీరు చూస్తే మాత్రం సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషుల లేక మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాల అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. అంతేకాదండోయ్ ఇక మనుషులు నీచంగా ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే మనుషుల కంటే అడవుల్లో ఉండే మృగాలే నయంఅనిపించేలా ఉంది. ఎందుకంటే సాటి మనుషులకు చిన్న అపాయం వస్తేనే అయ్యో పాపం అంటూ జాలి పడిన మనిషి ఇక ఇప్పుడు మాత్రం ఇక దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. సాటి మనుషుల విషయంలోనే కాదు మూగజీవాల విషయంలో కూడా కాస్తయినా జాలి చూపించడం లేదు.


 ఇక్కడ ఇద్దరు వ్యక్తులు చేసిన పని కాస్త ఏకంగా అందరినీ అవాక్కయ్యేలా చేసింది. సాధారణంగా మద్యం తాగాలి అనుకున్నప్పుడు ఎవరైనా సరే అందులోకి మంచింగ్ బాగుండాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే ఏదైనా నాన్ వెజ్ వండుకోవడం లేదంటే ఆమ్లెట్ తెచ్చుకోవడం చిప్స్ లాంటివి  కొంతమంది మంచింగ్ గా వాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఇద్దరు తాగుబోతులు మాత్రం ఏకంగా కుక్క చెవులు తోకను కోసి వాటిని మంచింగ్ గా. తీసుకున్నారు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజంగానే జరిగింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది.


 బర్రెల్లి జిల్లా ఫరీద్ పూర్ ప్రాంతంలోని ఎస్ డి ఎం కాలనీకి చెందిన ముఖేష్ వాల్మీకి ఇక మరో వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించారు. అయితే మద్యం మత్తులోనే  ఏకంగా రెండు కుక్కలను పట్టుకుని ఆ రెండు కుక్కల చెవులు కోసేయడమే కాదు వాటి తోకను కూడా కట్ చేసారు.  అనంతరం వాటికి ఉప్పు కారం బాగా దట్టించి వాటిని ఏకంగా మందులోకి మంచింగ్ గా చేసుకున్నారు. అయితే అటువైపుగా వెళ్తున్న ధీరజ్ అనే వ్యక్తి ఇది గమనించాడు.  ఇక ఇద్దరు మందుబాబులు చేసిన పనికి షాక్ అయి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: